NTV Telugu Site icon

Balayya : కమర్షియల్ సినిమాలంటే కేవలం డబ్బులోచ్చేవి కాదు..

Whatsapp Image 2023 10 24 At 3.34.39 Pm

Whatsapp Image 2023 10 24 At 3.34.39 Pm

బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి దసరా కానుకగా విడుదల అయి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఆ సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దర్శకుడు అనిల్ రావిపూడి తో గతంలోనే ఓ సినిమా చేయాల్సిందని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయిందని భగవంత్ కేసరి సక్సెస్ మీట్‌లో బాలయ్య అన్నారు..భగవంత్ కేసరి కథ బాగా రావడానికి అనిల్ రావిపూడికి తాను కొన్ని సలహాలు కూడా ఇచ్చానని బాలయ్య చెప్పాడు.సినిమా ఒప్పుకున్నాం…చేసేద్ధాం అని కాకుండా కథ బాగా రావడానికి నిరంతరం ఆలోచిస్తుంటానని బాలయ్య తెలిపారు. భగవంత్ కేసరి సినిమా కోసమే మా కాంబినేషన్ ఆలస్యమవుతూ వచ్చిందని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో శాశ్వతం గా నిలిచిపోయే సినిమా తమ కలయికలో రావడం ఎంతో ఆనందంగా ఉందని బాలయ్య తెలిపారు..

తెలుగు ఇండస్ట్రీ అంతా ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా గురించి చెప్పుకుంటున్నారని, అనిల్ రావిపూడిపై నమ్మకంతోనే ఈ సినిమా చేశానని బాలయ్య తెలిపారు.అలాగే కమర్షియల్ సినిమాలు అంటే డబ్బులొచ్చేవి మాత్రమే కాదు. మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలే అని బాలయ్య తెలిపారు.. తన అభిమాని అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమాను తెలుగు ప్రేక్షకులు గర్వపడేలా తెరకెక్కించాడని బాలయ్య ప్రశంసలు కురిపించారు.అలాగే ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురా అనే పాటను బుధవారం నుంచి యాడ్ చేయబోతున్నట్లు బాలయ్య తెలిపారు.. సినిమా పూర్తయిన తరువాత రోలింగ్ టైటిల్స్ ముందు ఈ పాట వస్తుందని ఆయన చెప్పారు..ఈ సక్సెస్ మీట్‌లో బాలయ్య తో పాటు శ్రీలీల, అనిల్ రావిపూడి, అర్జున్ రాంపాల్ వంటి తదితరులు పాల్గొన్నారు.బాలయ్య తన తరువాత సినిమా యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేయబోతున్నారు.