NTV Telugu Site icon

BB4 : బాలయ్య, బోయపాటి మూవీ లో ఆ హీరోయిన్ ను తీసుకోవాల్సిందే.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్..?

Bb4

Bb4

BB4 : నందమూరి నట సింహం బాలయ్య , స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా మూడు సినిమాలు తెరకెక్కగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.బాలయ్య ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా సింహా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకముగా చెప్పాల్సిన పని లేదు.అప్పటివరకు ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న బాలయ్య కి సింహా సినిమా భారీ విజయాన్ని అందించింది.దీనితో బోయపాటి బాలయ్య ఫేవరెట్ డైరెక్టర్ గా మారారు.బాలయ్యతో బోయపాటి తరువాత తెరకెక్కించిన లెజెండ్ సినిమా కూడా అద్భుత విజయం సాధించింది దీనితో వీరిద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా పేరొచ్చింది.

Read Also :Kalki 2898 AD : ‘కల్కి’ కాన్వాయ్ మాములుగా లేదుగా

బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ అఖండ.. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ సినిమా కూడా తిరుగులేని విజయం సాధించింది.దీనితో బాలయ్య ,బోయపాటి కాంబోలో మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.తాజాగా బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో నాలుగో సినిమా మొదలైంది.BB4 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుందా లేక కొత్త కథతో తెరకెక్కుతుందా అనేది ప్రశ్నగా మారింది.అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార నటించాల్సిందే అని ఫ్యాన్స్ డిమాండ్ చేసారు.మరోసారి సింహా కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.ట్విట్టర్ లో కూడా ఈ న్యూస్ ని హ్యాష్ టాగ్ లతో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Show comments