నందమూరి బాలయ్య ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమా తర్వాత అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమాకు ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తొలిసారి బాలయ్యని డైరెక్ట్ చేస్తున్న చిత్రం ఇది.. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది..
ఇక నేడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం లో బాలయ్య పాల్గొన్నారు. బాలయ్య తో పాటు పివి సింధు, హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలయ్య ప్రసంగిస్తూ శ్రీలీల గురించి పొరపాటున నోరు జారారు… తన సినిమాలోని శ్రీలీలా గురించి ఒక సీక్రెట్ ను బయటపెట్టాడు.. శ్రీలీల బిజీగా గడుపుతోంది అని చెబుతూ.. మా శ్రీలీల ఉంది.. ఉదయాన్నే మా సినిమా భగవంత్ కేసరిలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చింది అని పొరపాటున బాలయ్య చెప్పడం విశేషం. వెంటనే తేరుకుని రేపు మీరు చూసారుగా సినిమాలో అంటూ కవర్ చేశాడు..
భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య తొలిసారి తెలంగాణ యాస లో నటిస్తున్నారు. అనంతరం శ్రీలీల మాట్లాడుతూ.. కేన్సర్ ఆసుపత్రి కావడం తో తాను కూడా డాక్టర్ చదువుతున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. కాలేజీలో కేన్సర్ విభాగం అంటే మా ఫ్రెండ్స్ చాలా భయపడేవారు. కానీ ఇంతమంది డాక్టర్లు ఇక్కడ కేన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తున్నారు.. నిజంగా ఇది గర్వించదగ్గ విషయం అని అమ్మడు చెప్పుకొచ్చింది.. ఇంకా తన పర్సనల్ విషయాలతో సినిమా విషయాలను చెప్పు కొచ్చింది.. ఇక ప్రస్తుతం టాలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది..