Balapur Hundi Income 2025: తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఎంతో క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది లడ్డూకు రికార్డు ధర పలుకుతోంది. గతేడాది కొలను శంకర్ రెడ్డి రూ.30.01 లక్షలకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా అందరి అంచనాలను అందుకుంటూ బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ రికార్డు ధర పలికింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డే కాదు.. హుండీ ఆదాయం కూడా భారీ స్థాయిలో వచ్చింది.
Also Read: Asia Cup 2025: ఒకే ఒక్క వికెట్.. చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్ సింగ్! తొలి భారత బౌలర్‌గా
బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులు సమర్పించిన కానుకలను కమిటీ సభ్యులు లెక్కించారు. హుండీ ఆదాయం ఏకంగా రూ.23,13,760 వచ్చినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. గతేడాది హుండీ ఆదాయం రూ.18 లక్షలు వచ్చింది. అంటే ఈసారి 5 లక్షల ఆదాయం ఎక్కువగా వచ్చింది. ఈ ఏడాది వర్షంను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో భక్తులు బాలాపూర్ వినాయకుడిని దర్శించుకున్నారని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఈసారి స్వర్ణగిరి సెట్టింగ్ వేసిన విషయం తెలిసిందే. ఈ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
