Balali Villagers Gives 21 Thousand to Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వదేశంకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ విమానాశ్రయంలో భారీఎత్తున అభిమానులు ఆమెకు వెల్‌కమ్ చెప్పారు. భారత రెజ్లర్లు బజ్‌రంగ్ పునియా, సాక్షి మలిక్‌లు వినేశ్‌ను స్వాగతించిన అనంతరం తనతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ సాగిన వినేశ్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక తన స్వగ్రామం హరియాణాలోని బలాలిలో కూడా ఘనస్వాగతం లభించింది.
ఢిల్లీ నుంచి దాదాపు 10 గంటల పాటు ప్రయాణించి వినేశ్ ఫొగాట్ తన గ్రామానికి చేరుకున్నారు. వినేశ్ రాక కోసం ఎదురుచూసిన సొంతూరు ప్రజలు గొప్ప బహుమతిని ఇచ్చారు.గ్రామస్థులు వినేశ్‌కు రూ.21 వేల ప్రైజ్‌మనీ ఇచ్చారు. బలాలి గ్రామానికి చెందిన వాచ్‌మన్ కూడా రూ.100 ఇచ్చాడు. రూ.21 వేలు పెద్ద మొత్తం కాకపోయినా వారి ప్రేమను అలా తెలియజేశారు. అంతేకాదు 750 కేజీల లడ్డూలను తయారు చేసి గిఫ్ట్ ఇచ్చారు. ఆ లడ్డూను గ్రామమంతా పంచారు.
Also Read: UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి!
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే 100 గ్రాముల అదనపు బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దాంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాస్‌లోనూ మనకు తీర్పు అనుకూలంగా రాలేదు. దాంతో వినేశ్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు. రిటైర్‌మెంట్ నిర్ణయంపై వెనక్కి వచ్చేలా ఒప్పిస్తానని ఆమె పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ చెప్పారు. మహవీర్ మాటలతో వచ్చే ఒలింపిక్స్‌లో ఆమెను చూస్తామనే నమ్మకం ఉందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
