Site icon NTV Telugu

Balakrishna: జగన్‌తో సినీ ప్రముఖుల మీటింగ్‌పై రచ్చ.. అసెంబ్లీలో బాలయ్య వీరంగం..

Balakrishna

Balakrishna

Balakrishna Fires in AP Assembly: ఏపీ అసెంబ్లీలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ జరిగింది. ఈ చర్చ మధ్యలో బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రముఖులకు జగన్ అపోయింట్మెంట్ ఇవ్వలేదని.. చిరంజీవి గట్టిగా అడిగితే ఇచ్చారని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యపై బాలకృష్ణ స్పందించారు.. చిరంజీవి గట్టిగా ఆడిగితే జగన్ అపోయింట్మెంట్ ఇచ్చారనడం అబద్ధం అన్నారు.. కామినేని అసత్యాలు చెప్తున్నారన్నారు.. అంతే కాదు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి సైకో అంటూ వ్యాఖ్యానించారు.

READ MORE: Kishan Reddy: తెలంగాణలో రూ. 30 వేల కోట్లతో నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

“సైకోని ఇండస్ట్రీ నుంచి కొందరు కలవడానికి వెళ్లినప్పుడు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ వచ్చారు అనడం అబద్ధం. గట్టిగా ఎవ్వరూ అడగలేదు. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్‌ను కలవమన్నారు. చిరంజీవి గట్టిగా అడగడం వల్లే జగన్ వచ్చాడట.. అలా ఎవ్వరూ అడగలేదు. ఫిలిం డెవలప్మేంట్ లిస్ట్ తయారు చేయమని ఓ ఇన్విటేషన్‌ నాకూ వచ్చింది. అందులో నా పేరును తొమ్మిదివ ప్లేస్‌లో వేశారు. నా పేరును తొమ్మిదవ ప్లేస్‌లో వేసింది ఎవరు అని మంత్రి కందులను అడిగాను. మమ్మల్ని గౌరవించరా?” అని కౌంటర్ ఇచ్చారు.

READ MORE: పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం ఢిల్లీలో హైకోర్టులో పిటిషన్ వేసిన నటుడు నాగార్జున

 

 

 

 

Exit mobile version