లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్స్ తర్వాత.. సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రజెంట్ ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘స్లమ్ డాగ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న స్లమ్ డాగ్ నుంచి త్వరలోనే టీజర్ లేదా సాంగ్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా పూర్తి కావస్తుండటంతో పూరి తన తదుపరి ప్రాజెక్ట్ పై కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?
ఎప్పటి నుంచో వినిపిస్తున్న పూరి-బాలయ్య కాంబో మరోసారి రిపీట్ కానుందని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పైసా వసూల్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా, బాలయ్యను పూరి చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. అప్పటి నుండి వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తే బాగుంటుందని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పూరి జగన్నాథ్ మళ్లీ బాలయ్య కోసం ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ఒక మాస్ ఎంటర్టైనర్ కథను ఆయన రెడీ చేశారని, అయితే ఇంకా బాలయ్యకు కథ వినిపించాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఒకవేళ పూరి కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టవచ్చు. బాలయ్య తన ప్రస్తుత కమిట్‌మెంట్లను పూర్తి చేసిన తర్వాతే పూరి సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా.. పూరి మాత్రం బాలయ్యతో సినిమా చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు భోగట్టా.
