Priyadarshi : కమెడీయన్ వేణు దర్శకుడిగా మారి తీసిన సినిమా బలగం. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలో బలం ఉండటంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే బలగం సినిమా మాసిపోతున్న బంధాలను తట్టిలేపింది. అందుకే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు. అంతే కాకుండా సినిమాకు అవార్డుల పంటపండుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రియదర్శికి ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు వచ్చింది. ప్రియదర్శి స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.
చదవండి :Junior Panchayat Secretaries : జేపీఎస్‌లపై తెలంగాణ సర్కార్ సీరియస్.. విధుల్లో చేరకుంటే అంతే..
ప్రియదర్శితో పాటు సినిమాలో ఆయనకు తాతగా నటించిన కేతిరి సుధాకర్ రెడ్డి కూడా అవార్డు అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఆయనకు అవార్డు వచ్చి్ంది. 2021, 22 ఇయర్స్ మలయాళ చిత్రాలు ఉత్తమ చిత్రీకరణకు స్వీడిష్ అంతర్జాతీయ అవార్డును అందుకుంది. వాటి తర్వాత బలగం సినిమా ఆ జాబితాలో చేరి తొలి తెలుగు సినిమాగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను బలగం సినిమా గెలుచుకుంది.
చదవండి : PBKS vs KKR :ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా కనిపించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 50 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొని రికార్డులు సృష్టిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.