NTV Telugu Site icon

Harshaali Malhotra : తనను ట్రోల్ చేసిన వారికి బిగ్ షాక్ ఇచ్చిన బజరంగీ భాయిజాన్ పాప..

Whatsapp Image 2024 05 15 At 9.03.40 Am

Whatsapp Image 2024 05 15 At 9.03.40 Am

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా అనే అమ్మాయిని కీలక పాత్రలో నటించింది.”బజరంగీ భాయిజాన్” సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి,టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు.ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో సమానంగా హర్షాలీ మల్హోత్రా అనే చిన్నారి నటించింది.

Read Also : Bhagavanth Kesari : మరో అరుదైన ఘనత సాధించిన బాలయ్య సినిమా..?

బజరంగీ భాయిజాన్ 2015 న ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది. ఆ సమయంలో చిన్న పిల్లగా వున్నా ఆమె ఇప్పుడు పదవ తరగతి చదువుతుంది.అయితే హర్షాలీ మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా తాను చేసిన రీల్స్ షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ ఆమెను తెగ ట్రోల్‌ చేశారు. స్కూల్ కు వెళ్లి చదువుకో పాప’,’ఈ ఏడాది పదో తరగతి పాస్ అవుతావా.?’ అంటూ హర్షాలీ మల్హోత్రా ను ట్రోల్ చేశారు. అయితే తాజాగా ఈ భామ ట్రోలర్స్ నోరు మూయించింది.తాజాగా విడుదల చేసిన CBSC 10వ తరగతి ఫలితాలలో హర్షాలీ మల్హోత్రా 83% మార్కులు సాధించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టి అందరిని ఆకట్టుకుంది.ఇన్ని రోజులు తనకు వచ్చిన నెగెటివ్ కామెంట్స్ ని ఓ వీడియో ద్వారా చూపించింది.రీల్స్ చేస్తూనే రియల్ లైఫ్ లో విజయం సాధించవచ్చని హర్షాలీ మల్హోత్రా తెలిపింది.

Show comments