Site icon NTV Telugu

Baby : బేబీ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్..?

Whatsapp Image 2023 07 14 At 4.15.07 Pm

Whatsapp Image 2023 07 14 At 4.15.07 Pm

ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబీ..ఈ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ వచ్చే వరకు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. టీజర్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది.సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిందీ. మొదటి షో తరువాత ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా అదిరిపోయే టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో వైష్ణవి చైతన్య తన అద్భుతమైన నటనతో బాగా మెప్పించింది. తన కళ్ళతోనే హావభావాలు పలికించింది ఈ భామ.ఆమె ఎక్స్ప్రెషన్స్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఈ చిత్రం లో హీరోయిన్ గా మొదట స్టార్ హీరోయిన్ అయిన శ్రీ లీల అయితే బాగుంటుంది అని దర్శకుడు సాయి రాజేష్ అనుకున్నాడట.శ్రీ లీల ప్రస్తుతం పెద్ద సినిమాలలో నటిస్తుంది. అలాగే క్షణం తీరిక లేకుండా వరుసగా సినిమాలు చేస్తుంది.దాంతో ఈ సినిమా కథ కూడా వినకుండానే ఆమె ఈ చిత్రానికి నో చెప్పిందని సమాచారం.. శ్రీ లీల వంటి బాగా క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే ఈ సినిమాకి మార్కెటింగ్ కూడా బాగా వర్కౌట్ అవుతుందని అనుకున్నాడట దర్శకుడు కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో యూట్యూబ్ వీడియోస్ తో బాగా పాపులర్ అయినా వైష్ణవి చైతన్య ను హీరోయిన్ గా ఎంచుకున్నాడు దర్శకుడు సాయి రాజేష్..వైష్ణవి సినిమాలో హీరోయిన్ గా నటించాలని ఎంతో కష్టపడింది. ఈ ఆఫర్ రావడంతో ఆమెకు మంచి ఛాన్స్ దొరికినట్లు అయింది. తన నటనతో ఈ సినిమా రేంజ్ ను పెంచేసింది. బేబీ సినిమా అద్భుతమైన టాక్ ను సొంతం చేసుకుంది.శ్రీ లీల తన ఖాతా లో మంచి హిట్ సినిమాను మిస్ అయిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

Exit mobile version