Site icon NTV Telugu

Baby : బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్ రాబోతుందా..?

Whatsapp Image 2023 09 03 At 9.23.49 Am

Whatsapp Image 2023 09 03 At 9.23.49 Am

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీ విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమా ను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు… యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఇక ఈ సినిమా లోఆనంద్ దేవరకొండ, విరాజ్ నటన, వైష్ణవి పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీకి కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి.ప్రస్తుతం బేబి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బేబీ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట దర్శకుడు సాయి రాజేష్. బేబీ మూవీ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు బేబీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. కెరీర్ బిగినింగ్ లో సంపూర్ణేశ్ బాబు తో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి కామెడీ మూవీస్ చేసిన సాయి రాజేష్ బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో భారీగా క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక పై ప్రేక్షకులను మెప్పించే సినిమాలే చేస్తానని ఆయన తెలిపారు.. ఇదిలా ఉంటే బేబీ సినిమా కు  సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్న దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా ఎవరిని తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్ లో స్టార్ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సీక్వల్ బేబీ సినిమా కు  కొసాగింపుగా ఉంటుందా లేక కొత్త కథ ను తెరకెక్కిస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సీక్వెల్ వార్త పై దర్శకుడు సాయి రాజేష్ అధికారికం గా ప్రకటించాల్సి వుంది.

Exit mobile version