Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babu Jagjivan Ram Birth Anniversary: భారతదేశపు మొట్టమొదటి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి నేడు. 1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని ఆరా జిల్లా చంద్వాలో జన్మించిన ఆయన, స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయవేత్తగా, రక్షణ మంత్రిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా సేవలందించారు. దేశపు మొట్టమొదటి దళిత ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్. 1977 నుంచి 1979 వరకు జనతా పార్టీ ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈయనను “బాబూజీ” అని పిలుస్తారు. జగ్జీవన్కి ప్రధాన మంత్రి అవ్వడానికి అవకాశం వచ్చింది. కానీ.. ఓ బలమైన సంఘటన ద్వారా ఆయన ప్రధాని కాలేకపోయారు. నాటి షాకింగ్ విషయాలను నేడు తెలుసుకుందాం..
READ MORE: Khanapur Municipality: ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
బాబు జగ్జీవన్ రామ్ కుమారుడు సురేష్ రామ్. సురేష్ చేసిన ఓ పని ప్రధానమంత్రి కావాలన్న ఆయన కలను ఛిన్నాభిన్నం చేసింది. ఈ సంఘటనను నీరజ చౌదరి తన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ అనే పుస్తకంలో వివరించారు. పుస్తకంలోని వివరాల ప్రకారం.. మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత, ప్రధానమంత్రి పదవికి ప్రధాన పోటీదారులలో జగ్జీవన్ రామ్ ఒకరిగా నిలిచారు. ఈ విషయం ఇందిరా గాంధీ, చరణ్ సింగ్‌లకు కూడా బాగా తెలుసు. కానీ, బాబు కుమారుడు సురేష్ రామ్ ఓ కళాశాల విద్యార్థినితో శృంగారం చేసినట్లు, వారికి వివాహేతర బంధం ఉన్నట్లు ఒక్కసారిగా వార్తలు బయటకు వచ్చాయి. వారికి సంబంధించిన ఫొటోలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో (1978) మేనకా గాంధీ ‘సూర్య’ (Surya) అనే మ్యాగజైన్‌కి ఎడిటర్. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ ఆ ఛాయాచిత్రాలను తన ‘సూర్య’ పత్రికలో ప్రచురించారు. దీంతో ప్రధానమంత్రి కావాలన్న బాబు జగ్జీవన్ రామ్ కల నెరవేరలేదు. ఆ సమయంలో జగ్జీవన్ రామ్ చాలా శక్తివంతమైన రాజకీయ నాయకుడు, దేశ రక్షణ మంత్రిగా సేవలందిస్తున్నారు.
మేనకా గాంధీ పత్రిక ‘సూర్య’ పత్రిక చేసిన ఈ చర్య వల్ల ఆయన ప్రతిష్ట దెబ్బతింది. సూర్య పత్రిక తప్ప ఏ ఇతర మీడియా సంస్థలు ఈ వార్తలను ప్రముఖంగా ప్రచురించలేదు. కానీ.. ‘సూర్య’ పత్రిక మాత్రం నగ్నంగా ఉన్న ఫొటోలను సైతం ప్రచురించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. సురేష్ రామ్ 42 ఏళ్ల వివాహితుడని, అతని ప్రియురాలి వయసు కేవలం 20 ఏళ్లేనని కూడా ఆ పత్రిక పేర్కొంది. దీంతో ఆయన ప్రధాని పదవి అవకాశాన్ని కోల్పోయారు. ఆశ్చర్యకరంగా న్యూడ్ ఫొటోలు ప్రచురించిన తర్వాత సూర్య పత్రిక అమ్మకాలు విపరీతంగా పెరగాయి. సురేష్ ఛాయాచిత్రాలను సూర్య పత్రికలోనూ, నేషనల్ హెరాల్డ్లోనూ ప్రచురించవద్దని కోరుతూ జగ్జీవన్ రామ్ ఇందిరా గాంధీకి సందేశం పంపారట. కానీ ఆమె సరిగ్గా స్పందించలేదని ఒక కథనం ఉంది. ఖుష్వంత్ సింగ్ ఈ సంఘటనను తన ‘ట్రూత్, లవ్ అండ్ లిటిల్ మాలిస్’ అనే జీవితచరిత్రలో వివరించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!