NTV Telugu Site icon

Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌కు షాక్‌.. శాసనసభ్యత్వం రద్దు

Azam Khan

Azam Khan

Azam Khan: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజంఖాన్‌కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించిన ఒక రోజు తర్వాత ఆయన శాసనసభ్యత్వం కూడా రద్దయింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ సెక్రటేరియట్ శుక్రవారం సభ నుండి అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. విద్వేష ప్రసంగం కేసులో ఆజంఖాన్‌కు కోర్టు గురువారం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉందని అసెంబ్లీ సచివాలయం ప్రకటించిందని యూపీ శాసనసభ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ దూబే తెలిపారు.

Sugar Exports: చక్కెర ఎగుమతులపై నిషేధం.. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు పొడిగింపు

ఫలితంగా రాంపూర్‌ సదర్‌ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. రెండేళ్లు, అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఎమ్మెల్యే శాసనసభ్యత్వం రద్దవుతుంది. శిక్ష పూర్తయిన తర్వాత ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు. 2019 ఏప్రిల్‌లో ఎన్నికల సమావేశంలో రాంపూర్‌లో నియమించబడిన అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు ఆజం ఖాన్‌పై ద్వేషపూరిత ప్రసంగం కేసు నమోదైంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, మిలక్ కొత్వాలి ప్రాంతంలోని ఖతానగారియా గ్రామంలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసినందుకు ఖాన్‌పై కేసు నమోదు కాగా.. అప్పుడు ఖాన్‌ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చీటింగ్ కేసులో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఖాన్ ఈ ఏడాది ప్రారంభంలో జైలు నుంచి విడుదలయ్యాడు. దాదాపు రెండేళ్లు జైలు జీవితం గడిపాడు. ఎస్పీ నేతపై అవినీతి, దొంగతనం సహా దాదాపు 90 కేసులు ఉన్నాయి. గత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ సదర్ అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 10వ సారి విజయం సాధించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత లోక్ సభకు రాజీనామా చేశారు.