Azad Hind Fauj: వ్యాపారం పేరుతో భారత గడ్డపై అడుగు పెట్టి, సుమారుగా రెండు వందల ఏళ్లు మనల్ని బానిసలు చేసుకొని పాలించిన చరిత్ర బ్రిటిష్ వారిది. అలాంటి తెల్ల దొరలను గజగజలాడించిన వీరుల చరిత్ర మీలో ఎంత మందికి తెలుసు. వాళ్ల పేర్లు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి వీరుల కథే ఇది. ఇంతకీ మీలో ఎంత మందికి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలుసు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి ఎంత మందికి అవగాహన ఉంది. ఆయన చరిత్ర ఏంటి, బ్రిటిష్ గద్దెను కదిలించిన ఆజాద్ హింద్ ఫౌజ్ కథ ఏంటి.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Amaravati ORR :హైదరాబాద్ రింగ్ రోడ్డు కంటే పెద్దగా అమరావతి రింగ్ రోడ్డు !
సింగపూర్‌లో ఊపిరిపోసుకున్న ఇండియన్ నేషనల్ ఆర్మీ ..
భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ కథ ఎంతో స్ఫూర్తిదాయకమైన అధ్యాయం. 1942లో సింగపూర్‌లో ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)ని స్థాపించారు. దీనిని కెప్టెన్ మోహన్ సింగ్ స్థాపించారు, కానీ తరువాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ సైన్యానికి నాయకత్వం వహించారు. ఈ సైన్యం ప్రధాన లక్ష్యం భారతదేశం నుంచి బ్రిటిష్ పాలనను తరిమికొట్టి దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించడం. ఈ పోరాట సమయంలో నేతాజీ ఇచ్చిన కొన్ని నినాదాలు నేటికి ప్రచారంలో ఉన్నాయి. “నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను”. ఈ నినాదానికి దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సైన్యంలో “రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్” అనే మహిళా రెజిమెంట్‌తో సహా దాదాపు 85 వేల మంది భారతీయ సైనికులు ఉండేవారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ కథ భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి, ధైర్యానికి, స్ఫూర్తిదాయకమైన గాథగా విశ్లేషకులు అభివర్ణించారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న భారతదేశాన్ని చూసి, సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్యం కోసం ఆయుధాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన 1942లో సింగపూర్‌లో “ఆజాద్ హింద్ ఫౌజ్” (ఇండియన్ నేషనల్ ఆర్మీ – INA)ని స్థాపించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో దాదాపు 85 వేల మంది సైనికులు ఉండేవారు. వీరిలో భారతీయ సైనికులు, ఆగ్నేయాసియాలో స్థిరపడిన భారతీయులు, అనేక మంది మహిళలు ఉన్నారు. “రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్” అనే మహిళా విభాగం కూడా ఈ సైన్యంలో ఒక భాగం.
బోస్ దార్శనికతలో మహిళా సాధికారతకు ప్రతీకగా “ఝాన్సీ రాణి రెజిమెంట్” అనే మహిళా విభాగం ఏర్పడింది. జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ బర్మా (మయన్మార్)లో, భారత సరిహద్దులో బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడింది. బోస్ “జై హింద్”, “నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను” వంటి నినాదాలను ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. వాస్తవానికి ఈ నినాదాలు నేటికీ ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తున్నాయి.
అక్టోబర్ 21 ప్రత్యేకత..
ఆజాద్ హింద్ ఫౌజ్‌కు జపాన్ నుంచి విశేష మద్దతు లభించింది. అక్టోబర్ 21, 1943న నేతాజీ ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని కూడా స్థాపించారు. దీనిని అనేక దేశాలు కూడా గుర్తించాయి. INA బర్మా (మయన్మార్), ఇంఫాల్ సరిహద్దుల్లో బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. చివరికి ఈ సైన్యం యుద్ధంలో విఫలమైనప్పటికీ, ఆజాద్ హింద్ ఫౌజ్ త్యాగం, ధైర్యం భారతీయ ప్రజలలో స్వాతంత్ర్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేశాయి. బ్రిటిష్ ప్రభుత్వం గద్దె ఈ సైన్యం దెబ్బకు కదలింది అంటే వీరి పోరాటం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సైన్యం పోరాటం స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికీ నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని దేశభక్తి, ధైర్యానికి చిహ్నాలుగా పరిగణిస్తారు.
READ ALSO: Taliban Warning Pakistan: చచ్చిపోవాలంటే రెచ్చగొట్టండి.. పాక్‌కు ఆఫ్ఘన్ వార్నింగ్!
