Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సంచలనం.. ప్రపంచ నెం.1 ‘షి యూకీ’ని మట్టికరిపించిన ఆయుష్ శెట్టి..!
- ప్రపంచ నెం.1 షి యూకీపై ఆయుష్ శెట్టి సంచలన విజయం
- తొలి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే అద్భుత ప్రదర్శన
- 21-14, 13-21, 21-19 తేడాతో చైనా స్టార్‌పై గెలుపు
- డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని ఓడించిన భారత యువ ఆటగాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayush Shetty: భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు ఆయుష్ శెట్టి తన మొదటి బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే సంచలన విజయాన్ని నమోదు చేశాడు. బెంగళూరులో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ ‘షి యూకీ’ని 21-14, 13-21, 21-19 తేడాతో ఓడించాడు.
కర్ణాటకలోని కార్కళకు చెందిన ఆయుష్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు తన కోచ్ విమల్ కుమార్ ఇచ్చిన ప్రత్యేక సూచనను గుర్తు చేసుకుంటూ బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో ఆయుష్ అచ్చం అదే అనుసరించి విజయం సాధించాడు. అయితే ప్రపంచ నెం.1ను ఓడించిన తర్వాత కూడా అతడు పెద్దగా సంబరాలు చేసుకోలేదు. ఆనందం కంటే ఉపశమనం ఎక్కువగా కనిపించింది అతడి ముఖంలో.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందు షి యూకీపై ఆయుష్ రికార్డు 0-3గా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ షి యూకీ చేతిలో ఆయుష్ వరుస గేముల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో ఈసారి సొంత గడ్డపై, ప్రపంచ ఛాంపియన్షిప్ వంటి అతిపెద్ద వేదికపై చైనా స్టార్‌ను ఓడించాలనే పట్టుదలతో బరిలోకి దిగాడు. “ఇది చాలా ప్రత్యేకమైన విజయం. ఈ రోజు నేను ఆడిన విధానం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను” అని మ్యాచ్ అనంతరం ఆయుష్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం మానసికంగా, శారీరకంగా పూర్తిగా సిద్ధమయ్యానని అన్నారు.
6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్న ఆయుష్కు భారీ స్మాష్‌లు ప్రధాన బలం. అయితే షి యూకీపై అతడు కేవలం శక్తినే నమ్ముకోకుండా, ఎప్పుడు దాడి చేయాలి.? ఎప్పుడు డిఫెన్స్ ఆడాలి.. అనే విషయంలో అద్భుతమైన పరిణతి చూపించాడు. తొలి గేమ్‌లోనే 45 షాట్ల సుదీర్ఘ ర్యాలీని గెలుచుకుని ఆయుష్ తన ఆధిపత్యాన్ని చాటాడు. ఆ తర్వాత అతడి భారీ స్మాష్‌లు షి యూకీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ప్రత్యర్థి క్రాస్‌కోర్ట్ స్మాష్‌లకు స్ట్రెయిట్ బ్లాక్‌లతో సమాధానం ఇచ్చి, వెంటనే తిరిగి దాడికి దిగడం ఆయుష్ వ్యూహంలో కీలకంగా మారింది. ఫలితంగా ఆయుష్ 21-14తో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు.
రెండో గేమ్‌లో ఆటగాళ్లు కోర్టు వైపులు మార్చడంతో పరిస్థితులు మారాయి. గాలి దిశ తనకు అనుకూలంగా ఉండటంతో ఆయుష్ దూకుడును కొంత తగ్గించుకోవాల్సి వచ్చింది. అయితే క్రాస్‌కోర్ట్ క్లియర్స్లో సరైన పొడవును సాధించడంలో అతడు ఇబ్బంది పడ్డాడు. ఇదే అవకాశాన్ని షి యూకీ అందిపుచ్చుకున్నాడు. వరుస పాయింట్లు సాధిస్తూ రిథమ్‌లోకి వచ్చిన చైనా ఆటగాడు ఆయుష్‌ను తప్పులు చేసేలా చేశాడు. క్రమంగా మ్యాచ్‌పై పట్టు సాధించిన షి యూకీ రెండో గేమ్‌ను 21-13తో గెలిచి మ్యాచ్‌ను నిర్ణాయక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు.
నిర్ణాయత్మక గేమ్‌లో ఆయుష్ మళ్లీ తనకు అనుకూలమైన కోర్టు వైపు లభించడంతో తన అసలైన ఆటను బయటపెట్టాడు. భారీ స్మాష్ లతో పాటు మరింత నియంత్రణతో ఆడుతూ ఇంటర్వెల్ సమయానికి 11-5 ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత ఆధిక్యాన్ని 16-5కు పెంచుకున్నాడు. ఈ దశలో ఆయుష్ కెరీర్లోనే అతిపెద్ద విజయం దాదాపు ఖాయమైందని అనిపించింది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీ అంత సులభంగా లొంగిపోలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ భారీగా పుంజుకున్నాడు. తదుపరి 11 పాయింట్లలో 9 పాయింట్లు గెలుచుకుని ఆయుష్ ఆధిక్యాన్ని 18-15కు తగ్గించాడు. ఒత్తిడి పెరగడంతో ఆయుష్ కొంత అసహనానికి గురయ్యాడు. చిన్న గాయం కారణంగా 18-15 వద్ద మెడికల్ టైమ్అవుట్ కూడా తీసుకున్నాడు. అయినప్పటికీ షి యూకీ తన పోరాటాన్ని కొనసాగించాడు. కొద్దిసేపటికే ఆయుష్ ఆధిక్యం ఒక్క పాయింట్‌కు మాత్రమే పరిమితమైంది. స్కోరు 20-19గా మారడంతో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు చేరుకుంది.
HUGE UPSET OF THE TOURNAMENT! 🤯🔥
– India’s Ayush Shetty knocked out World No.1 & Defending Champion Shi Yuqi from BWF World Championship 2026!
🥹🥹🥹 pic.twitter.com/RGZPuIYvCR https://t.co/5pONfic6sm
— The Khel India (@TheKhelIndia) August 17, 2026
ఈ సమయంలో తనను తాను ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా కష్టంగా అనిపించిందని ఆయుష్ తెలిపాడు. “అతడు తిరిగి వస్తుండటంతో నాకు కొంత భయం మొదలైంది. అతడి వేగం పెరిగింది. నేను కొట్టిన ప్రతి షాట్‌ను అతడు ఎలాగోలా తిరిగి పంపిస్తున్నాడు. అందుకే నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకోవాలని చెప్పుకున్నాను. అదే సమయంలో దూకుడుగా ఆడాలని అనుకున్నాను” అని ఆయుష్ వివరించాడు. చివరకు మ్యాచ్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకున్న ఆయుష్ శెట్టి 21-19తో మూడో గేమ్‌ను గెలిచి ప్రపంచ నంబర్ వన్ షి యూకీని ఓడించాడు. దీంతో తన తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. బెంగళూరులో సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఆయుష్కు అదనపు బలంగా మారింది. మ్యాచ్ చివరి దశలో ఒత్తిడి పెరిగినప్పుడు స్టేడియంలో అభిమానుల నుంచి వచ్చిన భారీ మద్దతు తనకు ఎంతో శక్తినిచ్చిందని అతడు చెప్పాడు. కోచ్ విమల్ కుమార్ కూడా ప్రతి పాయింట్‌ను ఆస్వాదిస్తూ ఆడాలని ఆయుష్కు సూచించారు.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!