NTV Telugu Site icon

Ayalaan : అయలాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 01 23 At 7.31.52 Am

Whatsapp Image 2024 01 23 At 7.31.52 Am

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన తమిళ మూవీ అయలాన్ సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌కు పోటీగా బరిలో నిలిచిన ఈ భారీ బడ్జెట్ మూవీ పన్నెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దాదాపు 78 కోట్లకుపైగా గ్రాస్ , నలభై రెండు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్‌ రాబట్టింది.కెప్టెన్ మిల్లర్ తర్వాత 2024లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా అయలాన్ నిలిచింది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిన అయలాన్ సినిమాకు ఆర్ రవికుమార్ దర్శకత్వం వహించాడు.అయలాన్ మూవీ డిజిటల్ రైట్స్‌ను సన్ నెక్స్ట్ ఓటీటీ దక్కించుకున్నది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఫిబ్రవరి 16 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.. అయితే ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు ఓటీటీ రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయలాన్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తుంది.

నోవా గ్యాస్ అనే కెమికల్‌తో భూగ్రహానికి హాని తలపెట్టాలని చూసిన సైంటిస్ట్ కుట్రను ఏలియన్ సహాయంతో ఓ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నదే అయలాన్ మూవీ కథ. ఈ చిత్రాన్ని అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌ తో ఆర్ రవికుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో దాదాపు 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. అత్యధిక వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఇండియన్ మూవీ అయలాన్ కావడం విశేషం.గ్రాఫిక్స్ పనుల కారణంగానే అయలాన్‌ షూటింగ్ ఆలస్యమైంది. 2016లో అనౌన్స్‌ చేసిన ఈ మూవీని . దాదాపు ఎనిమిదేళ్ల పాటు షూటింగ్ జరిపి ఎట్టకేలకు 2024లో రిలీజ్ చేసారు.. ఈ సినిమాలో ఎలియన్ పాత్రకు సిద్ధార్థ్ వాయిస్ ఓవర్ అందించాడు. హీరో శివకార్తికేయన్‌తో పాటు సిద్ధార్థ్ కూడా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.. అయలాన్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది.కోలీవుడ్‌లో సంక్రాంతికి రిలీజైన అయలాన్ మూవీ తెలుగులో మాత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Show comments