Site icon NTV Telugu

INDvsAUs 1st Test: భారత్ 400 ఆలౌట్..కంగారూలపై 223 రన్స్ లీడ్‌

5

5

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ మంచి ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోర్ 321 /7తో బ్యాటింగ్ ప్రారంభంచిన టీమిండియా మూడో రోజు మరో 79 రన్స్‌ సాధించి 400 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో టీమిండియాకు మొదటి ఇన్నింగ్స్‌లో 223 రన్స్ లీడ్ లభించింది. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా (70)ను మర్ఫీ క్లీన్ బౌల్డ్ చేయగా..అనంతరం క్రీజులోకి వచ్చిన మహ్మద్ షమీ (37) అక్షర్‌కు తోడుగా నిలిచాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో ఆసీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ మర్ఫీ బౌలింగ్‌లో వెనుదిరగక తప్పలేదు. అనంతరం సిరాజ్ (1 నాటౌట్).. అక్షర్‌కు అండగా నిలిచాడు. కానీ సెంచరీ వైపు దూసుకెళ్తున్న అక్షర్ పటేల్‌ (84)ను కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Also Read: T20 Womens World Cup: ఆతిథ్య సౌతాఫ్రికాకు షాక్..శ్రీలంక సూపర్ విక్టరీ

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, భారత బౌలర్ల ధాటికి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. కేవలం 177 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో జడేజా ఐదు వికెట్లతో చెలరేగిపోగా.. అశ్విన్ మూడు వికెట్లు, షమీ, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (120) అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. రాహుల్ (20), అశ్విన్ (23), పుజారా (7), కోహ్లీ (12), సూర్యకుమార్ (8) అంతగా ఆకట్టుకోలేకపోయారు. వీరికి తోడు మూడో రోజు అక్షర్ పటేల్, షమీ కాసేపు పోరాడడంతో ఇండియా మంచి స్కోరు సాధించింది.

Also Read: Tejashwi Yadav: మీకేమో ప్రేమ పెళ్లి.. నా పెళ్లికి నిరుద్యోగం అడ్డంకి.. యువతి లవ్ లెటర్ వైరల్

Exit mobile version