Site icon NTV Telugu

Avatar : రివ్యూస్‌తోనే షాక్ ఇస్తున్న ‘అవతార్ 3’.. విజువల్స్ అదిరాయి.. కానీ అదే మైనస్?

Avathar3

Avathar3

ప్రపంచవ్యాప్త సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విజువల్ ఎపిక్ “అవతార్: ఫైర్ అండ్ యాష్” విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఈ పండోరా ప్రపంచంలోని మూడవ భాగం పై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన హాలీవుడ్ ప్రముఖ సంస్థల రివ్యూస్ మాత్రం మిశ్రమంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఐజిఎన్ (IGN), రోటెన్ టొమాటోస్ వంటి పాపులర్ వెబ్‌సైట్స్ ఈ చిత్రం గురించి షాకింగ్ రేటింగ్స్ ఇచ్చాయి. ఈసారి కూడా జేమ్స్ కామెరాన్ విజువల్స్‌తో మాయ చేశారని, యాక్షన్ సీక్వెన్స్ మరియు టేకింగ్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ప్రశంసలు దక్కుతున్నప్పటికీ,

Also Read : Jailer 2: జైలర్-2’లో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ.. తమన్నా తర్వాత ఆ బాధ్యత ఆమెదేనా?

కథలో ఆశించిన స్థాయిలో బలం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, అవతార్ సిరీస్‌లో మొదటి భాగం నుంచి మూడో భాగం వరకు రేటింగ్స్ క్రమంగా తగ్గుతూ రావడం విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. ‘అవతార్ 1’ సృష్టించిన ఇంపాక్ట్, రెండో భాగమైన ‘ది వే ఆఫ్ వాటర్’లో కొంత తగ్గిందనే వాదన ఉండగా, ఇప్పుడు మూడో భాగం ‘ఫైర్ అండ్ యాష్’లో కథా బలం (Story Depth) లోపించిందని సమీక్షకులు పెదవి విరుస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ కోసం పెట్టిన శ్రద్ధ, ఎమోషనల్ డెప్త్‌పై పెట్టలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, జేమ్స్ కామెరాన్ సినిమాలకు కేవలం రివ్యూలతోనే సంబంధం ఉండదని, థియేటర్లలో విజువల్ ఎక్స్‌పీరియన్స్ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Exit mobile version