Site icon NTV Telugu

Australia PM: అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ఆస్ట్రేలియా ప్రధాని

Australia Pm

Australia Pm

Australia PM: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ బుధవారం తన మొదటి భారత పర్యటనలో అహ్మదాబాద్ చేరుకున్న తర్వాత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో దిగి, నేరుగా మహాత్మా గాంధీ నివాసం, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంతో ముడిపడి ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. భారతదేశానికి నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి అల్బనీస్‌కు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు, ఆశ్రమ పర్యటనలో సందర్శిస్తున్న నాయకుడితో పాటు ఆయన కూడా ఉన్నారు. సబర్మతి ఆశ్రమంలో మహాత్మ గాంధీ విగ్రహానికి ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ నివాళులర్పించారు.

Read Also: BoycottBharatMatrimony: ‘బాయ్‌కాట్ భారత్ మ్యాట్రిమోనీ’ ట్రెండింగ్.. ఎందుకో తెలుసా?

అధికారులు పంచుకున్న షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా ప్రధాని సాయంత్రం తర్వాత రాజ్ భవన్‌లో హోలీ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి 8 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభమయ్యే నాల్గో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ను ఇద్దరు ప్రధానులు వీక్షించనున్నారు. ఇరు దేశాల ప్రధానులు మ్యాచ్‌ వీక్షించనున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version