Site icon NTV Telugu

Sania Mirza: సానియా మీర్జాతో కలిసి పనిచేస్తా: నొవాక్ జ‌కోవిచ్

Novak Djokovic

Novak Djokovic

Novak Djokovic Said I Like Very Much India: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సెర్బియా టెన్నిస్‌ స్టార్‌, డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ దూసుకెళుతున్నాడు. అద్భుత ఆటతో జకో క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జ‌రిగిన‌ నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియ‌న్ మ‌న్నారినోను వ‌రుస సెట్లలో 6-0, 6-0, 6-3తో చిత్తుగా ఓడించాడు. అయితే భారత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, టెన్నిస్‌ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జ‌కోవిచ్ చెప్పాడు. తాను మరోసారి ఇండియాకు రావాలనుకుంటున్నానని జొకోవిచ్ తెలిపాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్‌ అనంతరం సోనీ స్పోర్ట్స్‌ ఇంటర్వ్యూలో నోవాక్ జొకోవిచ్ పాల్గొన్నాడు. అదే షోలో సానియా మీర్జా కూడా పాల్గోంది. ఈ సందర్భంగా భారత్ ఆతిథ్యంను జకో గుర్తుచేసుకున్నాడు. ‘భారత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. సెర్బియా, భారత్ చరిత్రను పరిశీలిస్తే చాలా సారూప్యతలు ఉన్నాయి. నాకు భారతీయలు అంటే చాలా ఇష్టం. భారతీయలు నన్ను అభిమానుస్తునే ఉంటారు. భారతీయలు క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. భారత్‌లో క్రికెట్‌ ఒక మతంగా ఉన్నప్పటికీ.. టెన్నిస్‌ను కూడా ఆదరిస్తారు’ అని అన్నాడు.

Also Read: Sara Tendulkar-Gill: శుభ్‌మాన్ గిల్ సోదరితో సారా టెండూల్కర్.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా?

‘దాదాపు పదేళ్ల క్రితం ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల కోసం భారత్‌కు వెళ్లాను. రెండు రోజులు పాటు న్యూఢిల్లీలో ఉన్నాను. మరోసారి భారత్‌కు రావాలనుకుంటున్నాను. భారత్‌లో పిల్లల అభివృద్ధికి కొన్ని కార్యక్రమాలలో భాగం కావాలని ఆశిస్తున్నా. సేవా కార్యక్రామాలు నా భార్యకు కూడా ఎంతో ఇష్టం. అదే మా ఫౌండేషన్ లక్ష్యం. భారత్‌లో టెన్నిస్‌ అభివృద్దికి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేను భాగం కావాలనకుంటున్నా. పిల్లలు రాకెట్ పట్టుకుని టెన్నిస్ ఆడటం నాకు చాలా ఇష్టం. టెన్నిస్‌ అభివృద్దికి నేను అన్ని విధాలగా కృషి చేస్తాను. ఈ మిషన్‌ కోసం సానియా మీర్జాతో కలిసి పనిచేస్తా’ అని జకో చెప్పుకొచ్చాడు.

Exit mobile version