Australian Open 2024 Winner is Aryna Sabalenka: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా బెలారస్ భామ అరినా సబలెంక నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 6-3, 6-2తో చైనాకు చెందిన 12వ సీడ్ కిన్వెన్ జెంగ్‌పై విజయం సాధించింది. గంట 16 నిమిషాల్లో టైటిల్ పోరును బెలారస్ భామ ముగించింది. గతేడాది ఫైనల్లో ఎలెనా రిబకినాపై కష్టపడ్డ సబలెంక.. ఈసారి జెంగ్‌పై సునాయాస విజయం సాధించింది. టైటిల్ విన్నర్ సబలెంకాకు 31,50,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 21 లక్షలు) దక్కగా.. రన్నరప్ జెంగ్‌కు 17,25,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
తొలి సెట్‌లో రెండో గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన సబలెంకకు సెట్ గెలిచేందుకు ఎంతో సమయం పట్టలేదు. రెండో సెట్లోనూ రెండు బ్రేక్ పాయింట్లను సాధించిన బెలారస్ భామ సునాయాస విజయం సాధించింది. సబలెంకా జోరు ముందు జెంగ్ ఏమాత్రం నిలువలేకపోయింది. ఈ మ్యాచ్‌లో సబలెంక మూడు ఏస్‌లు, 14 విన్నర్లు కొట్టింది. మూడుసార్లు ప్రత్యర్థి సర్వీసు బ్రేక్ చేసింది. మరోవైపు జెంగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకుంది.
Also Read: Gold Price Today: స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
గత 13 నెలలుగా అరినా సబలెంక అద్భుతంగా ఆడుతోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 గెలిచిన సబలెంక.. యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్‌లలో సెమీఫైనల్ వరకు వెళ్ళింది. ఇప్పుడు మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. ఈ ఏడాదీ కొత్త సీజన్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన సబలెంక.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అజరెంకా (2012, 2013) తర్వాత వరుస టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచింది. మరోవైపు యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సబలెంకా చేతిలోనే ఓడి ఇంటిదారి పట్టిన జెంగ్.. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
EL MOMENTO.
Qué pedazo de torneo jugó Aryna Sabalenka 🦁pic.twitter.com/DPbpyZVi37
— Tiempo De Tenis (@Tiempodetenis1) January 27, 2024