NTV Telugu Site icon

Ex-Boyfriend: ఈ మాజీ లవర్ ఎంత అదృష్టవంతుడో.. 2 కోట్ల గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్‌!

Fift

Fift

ప్రేమ ఎంతో మధురం.. ప్రియురాలి మనసు అంత కఠినం.. ఇది టాలీవుడ్‌ సినిమాలోని పాట. ఓ సినీ కవి కథకు తగ్గట్టుగా రాసి ఉండొచ్చు. కానీ నిజ జీవితంలో ఓ ప్రియురాలు చేసిన పనిని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేరు. అది కూడా మాజీ బాయ్‌ఫ్రెండ్‌ కోసం అత్యంత ఖరీదైన గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్ చేసి.. అతడి ఆనందానికి అవధులు లేకుండా చేసింది. ఆ మాజీ ప్రేమికులెవరు? ఈ సీన్ ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవాల్సిందే.

చాలా మంది ప్రేమ విలువ తెలియకుండానే ప్రేమించుకుంటారు. కొంత కాలానికి విడిపోతుంటారు. కనీసం ముఖం వైపు చూడ్డానికి కూడా ఇష్టపడరు. ఇంకొంతమంది అయితే ప్రాణాలు పెట్టే వారుంటారు. కొన్ని సార్లు సినిమాల్లో జరిగినట్టుగా.. నిజ జీవితంలో జరగకపోవచ్చు. కానీ ఓ మాజీ ప్రియురాలు.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ (Ex Boyfriend) కోసం ఏకంగా రూ.2 కోట్ల ఖరీదైన కారును (Car Gifts) గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ఫ్రైజ్ చేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో (Australia) చోటుచేసుకుంది.

ప్రేమికులు అన్నాక గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకోవడాలు సహజమే. ఏవో చిన్న చిన్న గిఫ్ట్‌లు ఇచ్చుకుంటారు. కానీ విడిపోయిన తర్వాత కూడా ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడమంటే బహుశా ఈ ఘటనే కావొచ్చు.

టిక్‌టాక్ స్టార్ అయిన అన్నా పాల్ (24).. (Anna Paul) తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ పాల్ థామ్సన్‌కు రూ. 2 కోట్ల విలువైన అతని డ్రీమ్ కారును కొనుగోలు చేసి.. తాళాలు అందించింది. తాళాలు చూడగానే అతడు ఒకింత ఆశ్చర్యపోయాడు. ఊహించని ఆ పరిణామంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ కారు నచ్చిందా? అని ఆమె అడగ్గానే అతడు అన్నాపాల్‌ను కౌగిలించుకుని ముద్దాడాడు. ఈ సంఘటన అంతా రెండు కుటుంబాల మధ్యే జరగడం విశేషం.

ఇదిలా ఉంటే మాజీ భాగస్వాములిద్దరూ ఇంత ఆప్యాయంగా ఉండడం చూసి అభిమానులు, అనుచరులు గందరగోళానికి గురై ఆశ్చర్యపోయారు. దాదాపు వారిద్దరు ఎనిమిదేళ్ల పాటు డేటింగ్ చేసి 2023, ఆగస్టులో విడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరికి వింతగా అనిపిస్తే.. మరికొందరు మద్దతుగా వ్యా్ఖ్యాలు చేశారు. ఇంకొందరైతే విడిపోయాక కూడా ఇంత అందమైన స్నేహాన్ని కలిగి ఉండటం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు.

మొత్తానికి విడిపోయిన తర్వాత కూడా మాజీ ప్రేమికులు ఇంత అనోన్యంగా ఉండడం గొప్ప విషయమే. చాలా మంది చిన్న చిన్న విషయాలకే కోపగించుకోవడాలు.. విడిపోవడాలు చూస్తుంటాం. కానీ ఎనిమిదేళ్ల తర్వాత కూడా మాజీ లవర్స్ ఇలా ఖరీదైన గిఫ్ట్‌తో సర్‌ఫ్రైజ్ ఇవ్వడం అనేది గొప్ప సంగతే. ఈ గిఫ్ట్‌తోనైనా మళ్లీ ఇద్దరు కలుస్తారేమో వేచి చూడాలి.