NTV Telugu Site icon

Jessica Jonassen: ప్రేయసిని పెళ్లాడిన ఆసీస్‌ మహిళా క్రికెటర్‌.. ఫొటోలు వైరల్

Jessica Jonassen

Jessica Jonassen

Jessica Jonassen: ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ జెస్సికా జోనాసెన్ తన చిరకాల ప్రేయసి సారా వేర్న్‌ను వివాహం చేసుకుంది. పదేళ్లుగా డేటింగ్‌ చేస్తున్న ఈ ప్రేమికుల జంట ఏప్రిల్‌ 6న వివాహ బంధంలో అడుగుపెట్టింది. హవాయిలో అత్యంత సన్నిహితుల నడుమ జెస్సికా జోనాసెన్- సారా వేర్న్‌ల వివాహం ఘనంగా జరిగింది. ఈ మేరకు జోనాసెన్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది.

సారా – జోనాసెన్‌లు చాలాకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. 2018లో వీరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. వాస్తవానికి 2020లో ఈ జంట పెళ్లి చేసుకోవాలని భావించినా కరోనా కారణంగా అది వాయిదాపడింది. ఈ మధ్యకాలంలో జోనాసెన్ కమిట్‌మెంట్స్ వల్ల ఆమె పెళ్లిని వాయిదా వేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జెస్సికా జోనాసెన్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘‘సర్‌ప్రైజ్‌! థర్డ్‌టైమ్‌ లక్కీ.. ఎట్టకేలకు నా బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాను. ఏప్రిల్‌ 6.. నా హృదయంలో అలా నిలిచిపోతుంది’’ అని జెస్సికా ట్వీట్‌ చేసింది.

Read Also: Wedding Ceremony : పెళ్లికి వచ్చి.. పెట్టింది తిన్నారు.. వచ్చిన కట్నాలతో ఉడాయించారు

జోనాసెన్ ఈ విషయాన్ని షేర్ చేయగానే ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో మ్యాచ్ ప్రెజెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నీరోలి మీడోస్‌తో పాటు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆస్ట్రేలియన్ రచయిత్రి మేగాన్ మారిస్, కొత్తగా పెళ్లయిన జంటను అభినందిస్తూ, “ఇది అద్భుతమైన రోజులా కనిపిస్తోంది” అని రాశారు. జొనాసెన్ డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ తరఫున ఆడుతూ 9 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీయడమే గాక 73 పరుగులు కూడా చేసింది.

 

Show comments