బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా శనివారం (డిసెంబరు 14) నుంచి గబ్బాలో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. భారత కాలమాన ప్రకారం రేపు ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. పెర్త్ టెస్టులో భారత్ తేడాతో విజయం సాధించగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా జయకేతనం ఎగురవేసింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది. ఈ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తుది జట్టును ఓ రోజు ముందుగానే ప్రకటించాడు.
పక్కటెముకల గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన డేంజరస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దాంతో అయిదు వికెట్లు పడగొట్టిన స్కాట్ బోలాండ్ బెంచ్‌కే పరిమితం అవుతాడు. ఇదొక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన స్టార్ బ్యాటర్లు మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్‌లకు మెనెజ్‌మెంట్ మరోసారి అవకాశం ఇచ్చింది. డేంజరస్ బౌలర్ హేజిల్‌వుడ్ రాకతో భారత బ్యాటర్లు ఎలా ఆడతారో చూడాలి.
Also Read: D Gukesh: చరిత్రకు చెక్‌మేట్ పడింది, నువ్వు ఓ అద్భుతం.. గుకేశ్‌కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు!
మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు:
ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీనీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (కీపర్) పాట్ కమిన్స్, మిచ్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.