Devara : భారీ ధరకు అమ్ముడుపోయిన దేవర మూవీ ఆడియో రైట్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ “దేవర”.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు… ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు…యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంచింగ్ రోజు కొరటాల శివ మాట్లాడుతూ తన కెరీర్ లోనే దేవర సినిమా బెస్ట్ మూవీ అవుతుంది అని ఆయన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రామిస్ చేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని కొరటాల శివ భారీ రేంజ్ లో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా దేవర చిత్రం ఆడియో రైట్స్ కి కుదిరిన డీల్ గురించి తెలిస్తే సినిమా పై ఏ రేంజ్ లో హైప్ వుందో అర్ధం అవుతుంది..దేవర చిత్ర ఆడియో రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ రూ 27 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది దిమ్మతిరిగే ధర అనే చెప్పాలి. రీసెంట్ గా అల్లు అర్జున్ పుష్ప 2 చిత్ర ఆడియో రైట్స్ 45 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్ర ఫస్ట్ పార్ట్ ఆడియో ఇండియా వైడ్ గా సూపర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ కి కూడా బాగా కలసి వచ్చింది. పుష్ప 2 తర్వాత దేవర ఆడియో రైట్స్ డీల్ లో సెకండ్ హైయెస్ట్ గా నిలిచిందని సమాచారం.ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అనిరుద్ విక్రమ్, జైలర్ మరియు తాజాగా లియో లాంటి క్రేజీ చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలలో మ్యూజిక్ ఇప్పటికే ట్రెండింగ్ అని చెప్పాలి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడం అలాగే సినిమాకు అనిరుద్ మ్యూజిక్ ఇస్తుండడంతో దేవర మూవీ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయింది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!