ప్రస్తుత రోజుల్లో సాధారణ కార్లతో పాటు లగ్జరీ కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆడి ఈ విభాగంలో అనేక కార్లను అందిస్తుంది. కంపెనీ ఆడి Q3, A5 సిగ్నేచర్ లైన్ ఎడిషన్లను విడుదల చేశాడు. ఆడి భారత్ లో ఇప్పటికే ఉన్న SUVల సిగ్నేచర్ లైన్‌ను విడుదల చేసింది. తయారీదారు ఆడి Q3, Q3 స్పోర్ట్స్‌బ్యాక్, ఆడి Q5లను విడుదల చేసింది. ఆడి Q3 ధర రూ. 52.31 లక్షలు (ఎక్స్-షోరూమ్), రూ. 53.55 లక్షలు (ఎక్స్-షోరూమ్), స్పోర్ట్‌బ్యాక్ ధర రూ. 69.86 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also Read:Delhi Blast: భారీ పేలుడుతో దద్దరిల్లిన ఢిల్లీ..
కంపెనీ LED గేట్ ల్యాంప్‌లు, ప్రత్యేకమైన ఆడి రిమ్ డెకల్స్, కొత్త వీల్ హబ్ క్యాప్‌లు, క్యాబిన్‌లో సువాసన డిస్పెన్సర్, మెటల్ కీలు, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్‌లను అందించాడు. Q3 సిగ్నేచర్ లైన్, Q3 స్పోర్ట్‌బ్యాక్‌లలో పార్క్ అసిస్ట్ ప్లస్, 12V అవుట్‌లెట్, USB పోర్ట్ కూడా ఉన్నాయి. ఆడి Q3 సిగ్నేచర్ లైన్‌లో కొత్త 18-అంగుళాల స్పోర్టీ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. అయితే Q5 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. నవారా బ్లూ, గ్లేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, మాన్‌హట్టన్ గ్రే, డిస్ట్రిక్ట్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
