NTV Telugu Site icon

Physical Harassment: పాక్లో 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు

Pak

Pak

Physical Harassment: పాకిస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కరాచీలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఒక్కరా ఇద్దరా అని కాదు.. ఏకంగా 45 మంది మహిళా టీచర్లపై లైంగింకంగా వేధించాడని అక్కడి పోలీసులు తెలిపారు. వారిని బెదిరించి లైంగికంగా లొంగదీసుకున్నాడని పేర్కొన్నారు. నిందితుడు ఇర్ఫాన్ గఫూర్ మెమన్ గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Anasuya : క్యూట్ ఫోజులతో మైమరిపిస్తున్న రంగమ్మత్త..

నిందితుడు సీసీటీవీ ఫుటేజీలను చూపించి మహిళా టీచర్లను బెదిరించే వాడని పోలీసులు తెలుపుతున్నారు. అతని ఫోన్ లో 25 షార్ట్ వీడియో క్లిప్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. సీసీటీవీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్, మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా టీచర్ తో ప్రిన్సిపాల్ ఏకాంతంగా ఉన్న ఒక వీడియో బయటకు రావడంతో ఈ విషయం బయటపడింది.

Read Also: PM Modi: ఉదయనిధి “సనాతన” వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోడీ..

దీంతో నిందితుడు గఫూర్ కు స్థానిక కోర్టు ఏడు రోజులు రిమాండ్ విధించింది. అయితే మహిళా టీచర్లకు ఉద్యోగం ఆశ చూపించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా.. వారితో సన్నిహితంగా ఉంటూ.. వాటిని వీడియోలు తీసి అనంతరం వాటిని చూపిస్తూ బెదిరించే వాడని తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు సర్కారు ఓ కమిటీని నియమించింది. ఇప్పటివరకు ప్రిన్సిపాల్ గఫూర్ చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ఐదుగురు మహిళలు ముందుకు వచ్చారు.