NTV Telugu Site icon

MP: ఎంపీలో దారుణం.. వాయిస్ ఛేంజ్ యాప్ ద్వారా విద్యార్థినులను ట్రాప్ చేసి అత్యాచారం

New Project (29)

New Project (29)

మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులు ఇక్కడ ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులను మ్యాజిక్ వాయిస్ యాప్ ద్వారా ట్రాప్ చేసి అత్యాచారం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ప్రజాపతి, అతని సహచరులు రాహుల్ ప్రజాపతి, సందీప్ ప్రజాపతి, లవకుష్ ప్రజాపతి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రిజేష్ ప్రజాపతి వృత్తిరీత్యా కూలీ. యూట్యూబ్‌లోని వాయిస్‌ ఛేంజింగ్‌ మ్యాజిక్‌ యాప్‌ సాయంతో విద్యార్థినులను టార్గెట్‌ చేసేవాడు. అమర్వా గ్రామానికి చెందిన బ్రిజేష్ మద్వాస్‌లోని అత్తమామల ఇంట్లో ఉంటూ ఇలాంటి ఘటనలకు పాల్పడేవాడు. ఈ ఘటనలో మరో నిందితుడైన విద్యార్థి సమీపంలోని ప్రభుత్వం కళాశాలలో చదువుతున్నాడు. ప్రభుత్వ కళాశాలకు చెందిన వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి అమ్మాయిన నంబర్‌లు తీసి నిందితులకు ఇచ్చేవాడు.

READ MORE: Burra Venkatesham: జేఎన్టీయూని సందర్శించిన కొత్త ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్..

ఈ మ్యాజిక్ యాప్ ద్వారా ఆ కళాశాలలో పనిచేస్తున్న ఓ మేడమ్‌గా నటిస్తూ బాధిత విద్యార్థినులతో మహిళ గొంతుతో మాట్లాడేవారు. విద్యార్థినులు కూడా నమ్మడంతో ఓ రోజు నిందితుడు గొంతు మార్చి ఇలా మాట్లాడాడు. “నా కొడుకును మీ దగ్గరకు పంపిస్తున్నాను. స్కాలర్‌షిప్ కోసం అవసరమైన పత్రాలు తీసుకురా” అని ఓ విద్యార్థినికి చెప్పాడు. దీంతో బాధిత బాలికలు నిర్దేశిత ప్రాంతాలకు చేరుకోగానే నిందితులు బైక్‌పై ఎక్కించుకుని ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడే అత్యాచారానికి పాల్పడ్డారు. రేవా రేంజ్ ఏడీజీ మహేంద్ర సింగ్ సికర్వార్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధి జిల్లా మఝౌలీ పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ నుంచి కాల్ వచ్చింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం చాలా ప్రయత్నాల తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా.. ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థినులను బలిపశువులను చేసినట్లు తేలింది. ఇందులో నలుగురు విద్యార్థినులు ఒక్కొక్కరుగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.