NTV Telugu Site icon

Atrocious : ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి 13ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

Rape

Rape

Atrocious : దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వాలు మహిళ రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన వారిపై ఆగడాలు అదుపుకావడం లేదు. ప్రతి రోజు దేశంలో ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులు రెచ్చిపోయి చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా ఆడది అయితే చాలు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. దారుణం ఏంటంటే మహిళలు దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 13 ఏళ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Read Also: Wedding Gown : ఈ పెళ్లి గౌన్ గిన్నీస్ రికార్డ్ సాధించిందా.. ఏముంది అందులో స్పెషాలిటీ ?

అమేథీ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ గ్రామంలో దళిత కుటుంబం నివసిస్తోంది. బుధవారం రాత్రి ఆ కుటుంబంలోని 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన వారిస్(20), ఇంకో వ్యక్తి కలిసి ఎత్తుకెళ్లారు. అనంతరం జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను రాత్రంతా వారితో ఉంచుకొని గురువారం ఉదయం ఇంటికి పంపించారు. ఏం జరిగిందని బాధితురాలి తండ్రి ఆరా తీశాడు. తనపై జరిగిన దారుణం గురించి వివరించింది. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తన కూతురుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై స్థానిక మోహన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Show comments