NTV Telugu Site icon

ATM Pin: ఏటిఎం పిన్ మర్చిపోయారా.? పిన్ నెంబర్ ను ఈజీగా పొందడానికి ఇది ఫాలో అవ్వండి..

Atm

Atm

బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఎం కార్డు కూడా ఉంటుంది.. కొన్ని అత్యవసర పరిస్థితి అయితే డబ్బులను ఏటిఎం నుంచి డ్రా చేస్తారు.. కొన్నిసార్లు హడావిడిగా ఉండి పిన్ నెంబర్ ను మొత్తానికి మర్చిపోతారు.. అయితే అస్సలు ఆందోళన చెందకండి.. పిన్ నెంబర్ మళ్లీ పొందవచ్చు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడు చాలా మంది డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లడం లేదు. ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే ఏటీఎం కార్డు పిన్ నంబర్‌ను మరిచిపోతే డబ్బులు విత్‌డ్రా చేయలేరు. అలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఎందుకు. ATM మెషీన్ ఇంకా ఆన్‌లైన్ ద్వారా మనం సురక్షితంగా కొత్త పిన్ నంబర్‌ను రూపొందించవచ్చు..

మీరు వాడుతున్న బ్యాంక్ ఏటిఎం దగ్గరకు వెళ్ళాలి.. మెషీన్‌లో కార్డును ఇన్‌సర్ట్ చేసిన తర్వాత ఫర్ గెట్ పిన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.. బ్యాంకు అకౌంట్ కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను టైప్ చేయమని కోరుతూ స్క్రీన్‌పై మెసేజ్ కనిపిస్తుంది. తర్వాత atm మెషీన్‌లో మొబైల్ నంబర్‌ని టైప్ చేయండి.. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్‌కు OTP వస్తుంది. దానిని atm మెషీన్‌లో టైప్ చేసిన తర్వాత, మీకు కొత్త ATM పిన్‌ని రూపొందించడానికి ఒక అప్షన్ చూపిస్తుంది. ఏటీఎం పిన్‌ను ఆన్‌లైన్‌లో కూడా మార్చుకోవచ్చు. ATM PINని అకౌంట్ హోల్డర్ బ్యాంక్ అఫీషియల్ నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లో మార్చవచ్చు..

ఏటీఎం సెంటర్ కు మాత్రమే కాదు.. ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా కూడా కూడా లాగిన్ అయిన తర్వాత ATM కార్డ్ విభాగానికి వెళ్లి PIN change అప్షన్ పై క్లిక్ చేయండి.. ఆ తర్వాత ఏటీఎం కార్డుపై సీవీవీ, కార్డ్ నంబర్ చివరి కొన్ని అంకెలు, వాలిడిటీ తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయాలి.. ఆ తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ కు ఓటిపి వస్తుంది..మీరు స్క్రీన్‌పై దానిని టైప్ చేసి కొత్త పిన్‌ను రూపొందించవచ్చు… అంతే కొత్త పిన్ నెంబర్ ను పొందవచ్చు..