Viral Video: మనదేశంలో రోజూ జరిగే మామూలు సంఘటనలలో చోరీలు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఒక ఏటీఎం లో కనిపించిన సెక్యూరిటీ సన్నాహాలు చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సాధారణంగా దొంగలు ఏటీఎం మెషీన్‌నే టార్గెట్ చేయడం సహజం. కానీ ఇక్కడ ఏసీ, సీసీటీవీ కెమెరాలకూ తాళాలు వేయడం జనం ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. వైరల్ గా మారిన వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం..
Read Also:ENG vs IND: మేం ఏం స్టుపిడ్స్ కాదు.. ఇంగ్లండ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ ఏటీఎం ఎక్కడ ఉందొ తెలియదు కానీ.. ఏటీఎంలో ఏసీ యూనిట్‌ను భారీగా ఇనుప జాలితో కప్పి, దానికి బయట నుండి తాళం వేసారు. అంతే కాదండోయ్.. ఆశకు ట్విస్ట్ ఇదే. ఎక్కడైనా దొంగలను పట్టుకోవడానికి ఉపయోగించే సీసీటీవీ పరిస్థితి చూస్తే మాత్రం పొట్ట చెక్కలయ్యేలా నవ్వు రావడం పక్కా. అసలు అక్కడ ఏముందని కదా మీ అనుమానం.. ఆ ఏటీఎం లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలకూ ప్రత్యేక జాలి పెట్టి తాళం వేశారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. వీటినీ చోరీ చేసే అవకాశం ఉందన్న భయం. అంటే ఈ ప్రాంతంలో ఏటీఎం మాత్రమే కాకుండా, అందులో ఉన్న ఇతర పరికరాలూ టార్గెట్ అవుతున్నాయన్న విషయం బయట పడుతోంది.
Read Also:Shubman Gill: ‘నన్ను నమ్ము’.. సిరాజ్ కు గిల్ సూచన.. ఆ ప్లాన్ అమలు చేసిన వెంటనే..?
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్దెతున్న కామెంట్స్ వస్తున్నాయి. నిజమే భయ్యో.. ఇన్నాళ్లు ఇలాంటి ఆలోచనలు మిగితా బ్యాంకు వారికి ఎందుకు రాలేదని అంటుండగా.. మరికొందరేమో.. ఇంత లెవెల్ సెక్యూరిటీ ఉందంటే అక్కడ చోరీకి బాగా డిమాండ్ ఉన్నట్టుందని ఇంకొకరు పేర్కొన్నారు. మరొకరు సరదాగా కామెంట్ చేస్తూ.. దొంగలు ఇక మీ పనికి చెక్ పెట్టేసారు.. వేరే పని చూసుకోండి అని కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన ఒకటే చాలు.. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ఏటీఎంలోని మెషీన్ మాత్రమే కాదు.. ఏసీ, కెమెరా వంటి సాధారణ పరికరాలూ ఇప్పుడు భద్రత అవసరమైపోయాయి.
