కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ ఈ ఏడాది బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కించిన జవాన్ సినిమా తో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్టు అందించాడు. జవాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు దర్శకుడు అట్లీ.. అయితే తన తరువాత సినిమా కు సంబంధించి మాత్రం అధికారికం గా ప్రకటించలేదు. తాజా ఇంటర్వ్యూ లో రజినీకాంత్ తో చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు అట్లీ. తాను రజినీకాంత్ గారికి వీరాభిమానినని.. తలైవా నటించిన దళపతి సినిమా చూసిన తర్వాతే నేను ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చానని అట్లీ అన్నారు తాను రజినీకాంత్ నటించిన రోబో సినిమా కు శంకర్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానని చెప్పారు అట్లీ.
తలైవా తో తాను రెండు, మూడు కథా చర్చలు జరిపానని, కొన్ని ఐడియాలు కూడా చెప్పానని తెలిపారు.. కొన్ని అడ్డంకుల కారణంగా రజినీ సార్ కు సరిపోయే పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్ సిద్దం కాలేదని, భాషా సినిమా ను మించి పోయేలా సినిమా ఉండాలని తాను అనుకుంటున్నానని అట్లీ చెప్పుకొచ్చారు. ఆర్య, విజయ్ కెరీర్స్‌ను నా సినిమాలు తారా స్థాయి కి తీసుకెళ్లాయి.అలాంటి రేంజే రజినీ సార్‌కు కూడా ఉండాలనుకుంటున్నా. తలైవా నన్ను ముద్దుగా కన్నా అని పిలుస్తుంటారు. నా దర్శకత్వంలో నటించేందుకు ఆయన ఎప్పుడూ కూడా రెడీగానే ఉంటారని ధీమా వ్యక్తం చేశాడు అట్లీ. త్వరలోనే రజనీ సార్ తో సినిమా చేస్తాను అని అట్లీ తెలిపారు.ప్రస్తుతం రజినీకాంత్ టీజే జ్ఞానవేళ్ రాజా దర్శకత్వం లో తలైవా 170 లో నటిస్తుండగా ఆ సినిమా షూటింగ్ దశ లో ఉంది. దీంతోపాటు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేస్తున్న లాల్ సలామ్ 2024 జనవరి పొంగళ్ కానుక గా విడుదల కాబోతుంది..అలాగే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం లో తలైవా 171 అనే సినిమా ను కూడా అనౌన్స్ చేసారు..