పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో ఎంతో బిజీగా వున్నారు.ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో పవన్ సినిమా షూటింగ్స్ కూడా పక్కన పెట్టి తన పూర్తి సమయం రాజకీయాలకు కేటాయించారు.అయితే గత కొంత కాలంగా రాజకీయాలు, షూటింగ్స్ రెండిటికీ సమయం కేటాయిస్తున్న పవన్ ఇప్పుడు మాత్రం షూటింగ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తి ఫోకస్ రాజకీయాలపై పెట్టారు.. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి మరియు హరిహర వీరమల్లు.. వంటి వరుస సినిమాలకు కమిట్ అయ్యారు . ఈ మూడు సినిమాలు ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నాయి.పవన్ పాలిటిక్స్ నుంచి ఎప్పుడు ఫ్రీ అవుతారో అని నిర్మాతలు ఆయన కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే పవన్ ఖాతాలో ఇప్పుడు మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది. ఈ క్రేజీ మూవీ దాదాపు ఫిక్స్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీ – పవన్ కల్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో లో ఓ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం.ఈ సినిమాకి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే కమిట్ అయిన సినిమా షూటింగ్స్ ని పూర్తి చేయని పవన్ కల్యాణ్ ఇప్పుడు మరో సినిమాని ఓకే చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజకీయాల వల్ల పవన్ సినిమా షూటింగ్స్ కి తాత్కాలికంగా విరామం తీసుకున్నారు.ఎలక్షన్స్ పూర్తయిన వెంటనే ఒప్పుకున్న సినిమాలను ఫాస్ట్ గా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.పవన్ కమిట్ అయిన సినిమాల్లో ముందుగా సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ‘ఓజి’ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘హరిహర వీరమల్లు’ వంటి సినిమాలకు డేట్స్ కేటాయించనున్నారు.ఈ సినిమాలన్నీ పూర్తయ్యాకే పవన్ కల్యాణ్ అట్లీతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని త్రివిక్రమ్ తో పాటు మరో నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం.