Landslide in Ecuador: దక్షిణ ఈక్వెడార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈక్వెడార్‌లోని అలౌసీలో గల ఒక పర్వత గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో మట్టి, శిథిలాల కింద చిక్కుకుని 16 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 12 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఆరుగురిని ప్రాణాలతో దక్షించినట్లు వారు వెల్లడించారు. సుమారు 7 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. కొద్ది రోజులగా కురుస్తున్న వర్ణాల కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
Read Also: Russian Women : రష్యా మహిళను రాళ్లతో కొట్టారు.. ఎందుకంటే
భారీ వర్షాల కారణంగా ఈ ప్రాంతంలో ఫాల్ట్ లైన్లు ఏర్పడతాయని నివాసితులు పేర్కొన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కొద్ది రోజుల క్రితం అలౌసీని గ్వామోట్‌తో కలిపే హైవే నిరవధికంగా మూసివేయబడింది. ఆదివారం సాయంత్రం పర్వతం నుంచి మట్టి, రాళ్లు కూలిపోవడంతో అనేక గృహాలు ఆ శిథిలాల కింద నాశనమయ్యాయి. దేశ రిస్క్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీని అప్రమత్తం చేశామని, బాధితులకు సహాయం అందజేస్తామని అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో చెప్పారు.ఈ తాజా కొండచరియలు విరిగిపడిన కారణంగా రియోబాంబా, క్యూన్కా నగరాలను కలిపే ప్రధాన రహదారులలో ఒకదానిని మూసివేయవలసి వచ్చింది. ఈక్వెడార్ దక్షిణ తీరంలో భూకంపం సంభవించిన ఒక వారం తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. డజనుకు పైగా ప్రజలు మరణించారు.