Site icon NTV Telugu

Aswadhama: ఇంట్రెస్టింగ్ గా వరలక్ష్మీ కొత్త సినిమా టైటిల్.. హీరో లుక్ రిలీజ్

Whatsapp Image 2023 11 07 At 6.06.38 Pm

Whatsapp Image 2023 11 07 At 6.06.38 Pm

హృతిక్ శౌర్య ‘ఓటు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు….అక్టోబర్ 27 న విడుదల అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..ఈ సినిమాలో మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ . ”మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా..ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి. ఈ సినిమాలో హృతిక్ శౌర్య ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నా కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఇదిలా ఉంటే హృతిక్‌ శౌర్య బర్త్‌డే సందర్భంగా తన తరువాత సినిమా అశ్వధామ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్ అయింది..ఈ సినిమాలో వరలక్ష్మీ శరతకుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. . ‘హతః అక్షర’ అనేది ఉపశీర్షిక.

చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది. హృతిక్‌ శౌర్య తన మొదటి చిత్రం ‘ఓటు’ సినిమాలో సాఫ్ట్‌ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో ప్రొపర్‌ కమర్షియల్‌ హీరోగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. పక్కా కమర్షియల్‌ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్‌ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్‌ షేడున్న పాత్రలో ఒక సర్‌ప్రైజ్‌ ఆర్టిస్ట్‌ కనిపిస్తారు.హృతిక్ శౌర్య కి ఇది మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్‌ హీరోగా ఆయన ఎంతగానో ఎలివేట్‌ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి చిత్ర యూనిట్ ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్ ను చిత్రీకరించాం’’ అని అన్నారు.. ఈ సినిమాలో చిత్రం శ్రీను,టెంపర్‌ వంశీ, మానిక్‌ రెడ్డి, సత్యకృష్ణ, షేకింగ్‌ శేషు, యోగికత్రి,పటాస్‌ ప్రవీణ్‌ తదితరులుముఖ్య పాత్రలలో నటించారు..ఈ చిత్రానికి కెమెరా వర్క్ శ్యామ్‌ కె నాయుడు చేసారు.అలాగే ఆర్ట్‌ డైరెక్టర్‌ గా చిన్నా వ్యవహరించగా ఈ సినిమాకు ప్రజ్వల్‌ కుమార్‌మ్యూజిక్ అందించారు

Exit mobile version