Black Hole : సూర్యుడి కంటే పది రెట్లు పెద్దదైన బ్లాక్ హోల్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి దగ్గరగా వచ్చినట్లు వారు తెలిపారు. మొదటిసారిగా ఒక బ్లాక్ హోల్ ను పాలపుంతలో గుర్తించినట్లు సైంటిస్టులు వెల్లడించారు. దీనికి గయియ బీహెచ్ 1 అని పేరు కూడా పెట్టారు. ఇంటర్నేషనల్ జెమిని అబ్జర్వేటరీ సాయంతో వీళ్లు దీన్ని గుర్తించారు. కాంతిని కూడా చొరబడనివ్వని అంతరిక్ష అగాథాలను బ్లాక్ హోల్స్(కృష్ణ బిలం) అంటారు. ఒఫియకస్ నక్షత్ర మండలానికి 1,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు వెల్లడైంది. అంతకు ముందు కనుగొన్న కృష్ణబిలం కంటే ఇది భూమికి మూడు రెట్లు చేరువలో ఉంది. ఇది నక్షత్ర ద్రవ్యరాశి విభాగానికి చెందినదని పరిశోధకులు భావిస్తున్నారు. అసాధారణ అంతరిక్ష భాగాల పరిణామక్రమం గుట్టు విప్పేందుకు ఎంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.
Read Also: President Murmu Dance : సీఎం భార్యతో స్టేజ్ పైన స్టెప్పులేసిన రాష్ట్రపతి
ఏదైనా ఒక నక్షత్రం దాని గురుత్వాకర్షణ శక్తిని కోల్పోవడం వల్ల కృష్ణ బిలాలు ఏర్పడతాయి. ఒక పాలపుంతలో ఇలాంటివి పదికోట్లకు పైగా ఉంటాయన్నారు. నక్షత్ర ద్రవ్యరాశి సహిత కృష్ణబిలాలు సూర్యుడి ద్రవ్యరాశితో పోల్చితే 5 నుంచి 100 రెట్లు అధిక బరువున్న ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇలాంటివి ఒక్క పాలపుంతలోనే 100 మిలియన్ల వరకు ఉంటాయట. ఈ వివరాలు రాయల్ ఆస్ట్రానామికల్ సొసైటీ నెలవారీ ప్రచురణల్లో చోటుచేసుకున్నాయి. ఈ కృష్ణబిలంతో పాటు ఉన్న మరో నక్షత్రాన్ని కూడా పరిశోధకులు హవాయిలో ఉన్న జెమినీ నార్త్ టెలిస్కోప్ ద్వారా గుర్తించారు. ఈ సందర్భంగా ఇఐ బాడ్రీ అనే ఆస్ట్రోఫిజిస్ట్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా సుప్తావస్థలో ఉన్న బ్లాక్ హోల్ ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాను. ఈసారి నా ప్రయత్నం విజయవంతం అయింది అని చెప్పారు. ఈయన తన టీంతో కలిసి ఈ బ్లాక్ హోల్ ని గుర్తించారు. ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఆస్ట్రోనమీ గురించి రీసెర్చ్ చేస్తున్నారు. ఈ బ్లాక్ హోల్ గురించిన విషయాల్ని రాయల్ ఆస్ట్రోనామిక్ సొసైటీ నోటిస్ లో ఇఐ బాడ్రీ ప్రచురించారు.