Site icon NTV Telugu

Sunita Williams: అంతరిక్ష యాత్రపై కీలక ప్రకటన.. ఈసారి ఎన్ని రోజులంటే..

Sunitha

Sunitha

భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముచ్చటగా మూడోసారి అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు నాసా ప్రకటించింది. ఈసారి ఆమెతో పాటు మరో ఆస్ట్రోనాట్ బట్చ్‌ విల్మోర్‌ కూడా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఒక వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో నిర్వహిస్తోన్న మొదటి మానవ సహిత మిషన్ ఇది. దీనిలోభాగంగా స్టార్‌లైనర్ సామర్థ్యాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

ఇది కూడా చదవండి: Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..

ఈ అంతరిక్ష యాత్ర విజయవంతమైతే.. అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభనుంది. షెడ్యూల్ ప్రకారం.. మే 6న ఈ లాంచింగ్ జరగనుంది. కల్పనాచావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్‌ ఖ్యాతి గడించారు. సునీత తొలి పర్యటన.. 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు సాగింది. అప్పుడు 29 గంటల 17 నిమిషాల పాటు నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు. తర్వాత 2012లో నాలుగు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో పరిశోధనలు చేశారు.

ఇది కూడా చదవండి: SRH vs RCB: కోహ్లీ నామస్మరణతో మార్మోగిన ఉప్పల్ స్టేడియం.. రేపే మ్యాచ్..

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో ఇలా తెలిపింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఏజెన్సీ బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ కోసం సన్నాహకంగా ఏప్రిల్ 25, గురువారం నాసా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ మిషన్ రాత్రి 10:34 గంటలకు ప్రయోగాన్ని లక్ష్యంగా చేసుకోనుంది. మే 6, ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ దగ్గర స్పేస్ లాంచ్ కాంప్లెక్స్-41 నుంచి లాంచింగ్ జరగనుంది. నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సునీతా విలియమ్స్ ఒక వారం పాటు అంతరిక్షంలో ఉంటారు.

ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్, హరీష్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Exit mobile version