Never donate these things in your life: హిందూ ధర్మ శాస్త్రంలో దానధర్మాలు (విరాళం) చేయడం ఎంతో మంచిదని చెప్పబడింది. అందుకే ప్రతిఒక్కరు తమ స్థాయికి తగ్గట్టుగా దానధర్మాలు చేస్తుంటారు. దానం చేయడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. దాంతో వ్యక్తి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటాయి. అయితే దానం అవసరం ఉన్నవారికే చేయాలి, లేకపోతే దానం చేసిన వస్తువుకు విలువ ఉండదు. ఇక దానధర్మాలు చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. ముఖ్యంగా ఈ 5 వస్తువులను అస్సలు దానం (Unauspicious Things For Donation) చేయకూడదు. అలా చేస్తే మీ అదృష్టం కాస్త దురదృష్టంగా మారుతుంది.
ఇనుము:
ఇనుప వస్తువులను దానం చేయకూడదు. ఇలా చేస్తే మీరు ఆర్థిక సంక్షోభంలో పడినట్టే. శారీరకంగా కూడా అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇనుములో శని నివసిస్తుందని, దానిని దానం చేయడం వల్ల శని దేవుడికి కోపం వస్తుందని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.
చీపురు:
చీపురు కట్టాను దానం చేయరాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవికి కోపం వచ్చి ఇల్లు వదిలి వెళ్లిపోతుంది. లక్ష్మిదేవి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఆర్ధిక కష్టాలు మొదలవుతాయి.
ఉప్పు:
ఉప్పు దానం చేస్తే చాలా కష్టాలు పెరుగుతాయి. ఉప్పును దానం చేయడం ద్వారా ఓ వ్యక్తి రుణగ్రహీత అవుతారు. అందుకే ఉప్పును అస్సలు దానం చేయవద్దు.
లక్ష్మిదేవి విగ్రహం:
లక్ష్మిదేవి విగ్రహాన్ని దానం చేయకూడదు. చాలా మంది వెండితో లక్ష్మిదేవి బొమ్మ చేయించి గిఫ్ట్ ఇస్తారు. అది కూడా మంచిది కాదు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మిదేవిని ఇంటి నుంచి మనమే వెళ్లగొట్టినట్టు. మీరు వెండి నాణేలను దానం చేయవచ్చు. అందులో లక్ష్మిదేవి బొమ్మ ఉండకూడదు.
మిగిలిన ఆహరం:
అన్నదానం కంటే గొప్ప దానం లేదు. ఇలా చేస్తే దేవతలు కూడా సంతోషపడుతారు. అయితే ఇంట్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ దానం చేయకూడదు. అటువంటి దానం పుణ్యాన్ని బదులుగా.. పాపాన్ని ఇస్తుంది.
కొత్త బట్టలు:
జాతకంలో సప్తమంలో బృహస్పతి ఉన్నవారు కొత్త బట్టలు దానం చేయకూడదు. ఇలా చేయడం వలన ఒక వ్యక్తి యొక్క ఆనందాన్ని ప్రభావితం చేస్తుంది.
Also Read: Yuzvendra Chahal Batting Order: బ్యాటింగ్ ఆర్డర్‌పై చహల్ అయోమయం.. నవ్వులు పూయిస్తున్న వీడియో!
నల్ల నువ్వులు:
నల్ల నువ్వులు రాహు-కేతువులకు, శని గ్రహానికి సంబంధించినదని చెబుతారు. నల్ల నువ్వులను దానం చేయడం వలన మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఆర్థిక నష్టాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.
మత పుస్తకాలు:
మతం పట్ల ఆసక్తి లేని వారికి మత పుస్తకాలను దానం చేయకూడదు. మీరు మత పుస్తకాలను నాస్తికుడికి దానం చేస్తే.. అతను వాటిని అవమానకరంగా ఎక్కడో ఉంచుతాడు. దీని వల్ల పుణ్యానికి బదులు పాపం మీ ఖాతాలో చేరుతుంది.
ఆవ నూనె, అగ్గి పుల్ల:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆవ నూనె శని దేవుడికి సంబంధించినది. ఏడున్నర సంవత్సరాల శని దేవుడిని తొలగించడానికి ఆవాల నూనెను దానం చేస్తారు. ఆవ నూనె తీసుకుంటే శని ఆగ్రహానికి గురవుతాడు. అగ్గి పుల్లలు దానం చేయడం వల్ల ఇంట్లో అనవసరంగా గొడవలు మొదలవుతాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ntvtelugu.com దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Hardik Pandya: తప్పులు చేశాం.. మూల్యం చెల్లించుకున్నాం: హార్దిక్ పాండ్యా