NTV Telugu Site icon

Assam Earthquake: అస్సాంలో భూ ప్రకంపనలు!

Earthquakebihar

Earthquakebihar

అస్సాంలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం తెల్లవారుజామున (2.25 గంటలకు) అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం సంభవించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సీఎస్‌) పేర్కొంది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. దాంతో జనాలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అస్సాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు సంభవించాయని ఎన్‌సీఎస్‌ తెలిపింది. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

బంగ్లాదేశ్, భూటాన్, చైనాతో సహా పొరుగు దేశాలలో కూడా భూకంపం సంభవించింది. 5 తీవ్రతతో సంభవించే భూకంపాన్ని మోస్తరుగా పరిగణిస్తారు. అస్సాంలో భూకంపాలు సర్వసాధారణం. ఎందుకంటే ఈ రాష్ట్రం భారతదేశంలోని అత్యధిక భూకంపాలకు గురయ్యే జోన్‌లలో ఒకటి. అస్సాంలోప్రకంపనల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అస్సాంలో భూ ప్రకంపనల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.