NTV Telugu Site icon

Assam : అస్సాం గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు.. చెరువులో దూకి ఆత్మహత్య

New Project (95)

New Project (95)

Assam : అస్సాంలోని నాగోన్ డింగ్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం మరణించాడు. నేరస్థలానికి తీసుకెళ్తుండగా పోలీసుల అదుపు నుంచి తప్పించుకుని చెరువులో దూకినట్లు చెబుతున్నారు. నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు అతన్ని నేరస్థలానికి తీసుకెళ్తుండగా చెరువులో దూకినప్పుడు మరణించాడని పోలీసులు తెలిపారు.

రెండు గంటలపాటు వెతికిన తర్వాత నిందితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నేరస్థులు అమాయకపు చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా, 10వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో ఉంచారు. బాధితురాలు వివస్త్రగా పడి ఉండటాన్ని ఎవరో గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

Read Also:Blast in Firework Factory: ఏపీలో మరో ప్రమాదం.. టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

ఈ ఘటన తర్వాత అస్సాంలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. బాధితురాలిని నాగావ్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో చేర్చారు పరిస్థితి విషమంగా ఉంది. మైనర్‌పై సామూహిక అత్యాచారం ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్థానికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దీంతో పాటు నిందితులను అరెస్టు చేసే వరకు నిరవధిక బంద్‌కు వివిధ సంస్థలు, నిర్వాసితులు డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఖండించారు. మైనర్‌పై జరిగిన దారుణ ఘటన మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని ట్వీట్‌ చేశారు. ఇది మా సామూహిక మనస్సాక్షిని గాయపరిచింది. నిందితులను విడిచి పెట్టబోమన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి అటువంటి రాక్షసులపై సత్వర న్యాయం జరిగేలా చూడాలని అస్సాం పోలీసు డిజిపిని ఆదేశించానన్నారు. బాధితురాలు ప్రస్తుతం బాగానే ఉందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాష్ట్ర కేబినెట్ మంత్రి పీయూష్ హజారికా తెలిపారు. ఘటన అనంతరం మంత్రి పీయూష్ హజారికా ఢింగ్‌ను సందర్శించి బాధితురాలి ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.

Read Also:Nag Aswin: ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడి విమర్శలకు నాగ్ అశ్విన్ రిప్లై అదుర్స్ కదూ..