Site icon NTV Telugu

Pakistan: అత్యంత రహస్యంగా అసిమ్ మునీర్ కుమార్తె వివాహం.. ఎవరితో జరిగిందంటే..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ సైన్యాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన అసిమ్ మునీర్ కుమార్తె వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. మునీర్ కుమర్తె మహనూర్‌ను డిసెంబర్ 26న తన అబ్దుల్ రెహమాన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ పెళ్లి పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, సైన్యంలో ముఖ్యులు, ఇతర ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఎలాంటి ఫోటోలను విడుదల చేయలేదు.

Read Also: Director Maruthi: డైరెక్టర్ మారుతి ఇంటికి బిర్యానీ పంపిన డార్లింగ్ ఫ్యాన్స్!

అబ్దుల్ రెహమాన్, అసిమ్ మునీర్ సోదరుడు ఖాసిమ్ మునీర్ కుమారుడు. అబ్దుల్ రెహ్మాన్ గతంలో పాక్ ఆర్మీలో కెప్టెన్ హోదాలో పనిచేశాడు. ఆ తర్మాత, సైన్యం కోటాలో పాక్ సివిల్ సర్వీసుల్లో చేరాడు. ప్రస్తుతం, అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఆసిమ్ మునీర్‌కు నలుగురు కుమార్తెలు, ఇతడి మూడో కుమార్తె మహనూర్. ఈ వివాహానికి పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్, ఐఎస్ఐ చీఫ్, రిటైర్డ్ జనరల్స్, సైన్యానికి చెందిన మాజీ చీఫ్‌లు హాజరయ్యారు. భద్రతా కారణాల వల్ల కేవలం 400 మందికి పైగా అతిథులు మాత్రమే వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.

Exit mobile version