నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా హత్య చేసిన కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్ కౌంటర్ మృతుడు రియాజ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని రియాజ్ ను పట్టుకున్న ఆసిఫ్ వెల్లడించారు. కానిస్టేబుల్ ను హత్య చేసిన నిందితుడు పారిపోతుంటే పట్టుకున్నాను అని తెలిపారు. నాపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:POCSO Case: కోర్టు సంచలన తీర్పు.. దంపతులకు చెరో 180 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..!
దొంగ నోట్ల కేసు, వాహనాల దొంగతనానికి కేసులు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. నా పేరు పై ఒక్క వాహనం లేదు, ఒక్క పోలీస్ కేసు లేదు అని ఆసిఫ్ వెల్లడించారు. తాను మెకానిక్ ని కాదని.. తనది వెల్డింగ్ షాప్ అని వెల్డింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాని తెలిపారు. రియాజ్ ఎన్ కౌంటర్ పై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నాపై దుష్ప్రచారం చేస్తుంది అని ఆసిఫ్ మండిపడ్డారు.
