NTV Telugu Site icon

Kaur Singh: భారత బాక్సింగ్ దిగ్గజం కౌర్‌ సింగ్ ఇక లేరు..

Kaur Singh

Kaur Singh

Kaur Singh Passes Away: భారత బాక్సింగ్ దిగ్గజం, 1982 ఆసియా క్రీడల బాక్సింగ్ ఛాంపియన్ కౌర్ సింగ్(74) తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కౌర్ సింగ్.. గురువారం హర్యానాలోని కురుక్షేత్ర ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. కౌర్‌ సింగ్ తన అద్భుత నైపుణ్యంతో బాక్సింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొట్టారు. ఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో కౌర్‌ స్వర్ణం సాధించారు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఆరు పసిడి పతకాలు సాధించిన ఈ వెటరన్‌ బాక్సర్‌ ఒలింపిక్స్‌లోనూ భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించారు.

Read Also: India-UAE Gold Trade: ఆ దేశం నుంచి లక్షల టన్నుల బంగారం.. చౌకగా దిగుమతి చేసుకోనున్న భారత్!?

1980 జనవరిలో మహ్మద్ అలీతో నాలుగు రౌండ్ల ఎగ్జిబిషన్ పోరులో కౌర్ సింగ్ తలపడ్డారు. కౌర్‌ సింగ్ సాధించిన ఘనతలకు గుర్తింపుగా 1982లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ పురస్కారం, 1988లో విశిష్ట సేవా మెడల్ పురస్కారాలు లభించాయి. 1979లో జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌గా వెలుగులోకి వచ్చిన కౌర్‌.. అంతకుముందు సైన్యంలో విధులు నిర్వర్తించారు. 1971లో పాక్‌తో యుద్ధంలో పోరాడారు. కౌర్‌ మృతి పట్ల పంజాబ్‌ సీఎం భగ్‌వంత్‌ మాన్‌ సంతాపం తెలిపారు.