Site icon NTV Telugu

Ind vs Pak: మ్యాచ్‌ ప్రారంభానికి నిమిషాల ముందు భారత్‌కు భారీ షాక్..

Ind Vs Pak Final

Ind Vs Pak Final

India vs Pakistan: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. దాయాదిలైన భారత్, పాకిస్థాన్ మధ్య సమరం ప్రారంభమైంది. పాకిస్థాన్ టాస్ ఓడింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్ చరిత్రలో 41 ఏళ్ల చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడటం ఇదే తొలిసారి. కానీ ఈ మ్యాచ్‌కు ముందు టీం ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. హార్దిక్ స్థానంలో రింకు సింగ్‌కు అవకాశం లభించింది. గత మ్యాచ్‌లో హార్దిక్ గాయపడటం గమనించదగ్గ విషయం. అతను ఒక ఓవర్ బౌలింగ్ చేసిన తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. గాయం కారణంగా ఫైనల్‌లో ఆడటంపై సస్పెన్స్ నెలకొంది.

READ MORE: Rudraksha Switzerland Demand: క్రైస్తవ దేశంలో రుద్రాక్షలకు డిమాండ్.. ఎందుకంటే!

కాగా.. ఆసియా కప్‌లో ఇప్పటివరకు భారత్ తన అజేయ పరంపరను కొనసాగిస్తోంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా ఫైనల్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. భారత్‌తో తలపడిన రెండు మ్యాచుల్లోనూ పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌ను సైతం భారత్ సొంత చేసుకుంటుదని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version