బిగ్ బాస్ ఫేమ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి పై ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS)లో భారీ ఆర్థిక మోసం కేసు నమోదైన సంగతి తెలిసిందే. లండన్‌కు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లి పేరుతో నమ్మించి సుమారు రూ. 9.35 కోట్లు కాజేశారని వచ్చిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై ఉన్న ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను రద్దు చేయాలని కోరుతూ ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అషురెడ్డి .
అషురెడ్డి తన పిటిషన్‌లో పోలీసుల తీరుపై కొన్ని కీలక అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కనీసం తన వెర్షన్ లేదా వివరణ తీసుకోకుండానే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. తన పరువు ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇవన్నీ చేస్తున్నారని, ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె వాదిస్తోంది. ఈ కేసు విచారణపై స్టే విధించాలని, పోలీసుల తదుపరి చర్యలను అడ్డుకోవాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ త్వరలోనే హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.
