Site icon NTV Telugu

Love Me: ‘రావాలి రా ‘ అంటున్న దెయ్యాల ప్రేమ గీతం..

Lve Me

Lve Me

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటి వారసుడుగా ఆశిష్ ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్, వైష్ణవి చైతన్య నటిస్తున్న రొమాంటిక్ హార్రర్ థ్రిల్లర్ మూవీ ‘లవ్ మీ’. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి.. విభిన్న కథ తో రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు..

దెయ్యాన్ని ప్రేమించడం కోసం.. హీరో దెయ్యాన్ని వెతుకుంటూ వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంది. దాంతో మూవీ పై అంచనాలు పెరుగుతున్నాయి.. ఈ సినిమాను పక్కా ప్లాన్ తో జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుంది.. ఈ క్రమంలోనే తాజాగా మొదటి సాంగ్ ను విడుదల చేశారు.. కొన్ని నిముషాల ముందు రిలీజ్ అయిన ఈ పాట భారీగా వ్యూస్ ను సంపాదిస్తుంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుంది..

‘రావాలి రా ‘ అంటూ దెయ్యాలు పాడే ప్రేమ గీతంను విడుదల చేశారు.. చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ ను అందించారు.. అమల చేబోలు, గోమతి ఐయర్, అదితి భావరాజు, అజ్మల్ ఫాతిమా పర్వీన్, సాయి శ్రేయ పాటని ఆలపించారు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.. అంతేకాదు హీరోయిన్ వైష్ణవి చైతన్య కూడా ఓ లైన్ పాడిందట.. వారం రోజుల పాటు కష్టపడి పాటను పాడిందని ఆమె ఓ సందర్బంలో చెప్పింది.. ఆ సాంగ్ ఎలా ఉందో మీరు వినండి..

Exit mobile version