Site icon NTV Telugu

Vishwambhara : ‘విశ్వంభర’ నుంచి బర్త్ డే సర్ప్రైజ్ – ఆషిక రంగనాథ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా!

Vishvambara

Vishvambara

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న భారీ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ మూవీ ‘విశ్వంభర’. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా, ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్‌తో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఆషిక రంగనాథ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ ..

పోస్టర్‌కి వచ్చిన స్పందన చూస్తుంటే.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌ అవుతున్నారు. “పోస్టర్ అదిరిపోయింది”, “ఆషిక కళ్ళలో మ్యాజిక్ ఉంది”, “విశ్వంభర‌కు మరో హైలైట్ ఆమె అవుతుందని ఫిక్స్” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమె అందాన్ని, క్యారెక్టర్ డెప్త్‌ను హైలైట్ చేస్తోంది. చిరు సరసన  త్రిష తో పాటు, సెకండ్ హీరోయిన్ ఈ కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ నటిస్తోంది. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్న యూవీ క్రియేషన్స్, ప్రమోషనల్ స్ట్రాటజీలో కూడా కొత్తదనం చూపించబోతున్నారు.

బర్త్ డే పోస్టర్‌తో మొదలైన ఈ ప్రమోషన్ రన్ ఇక నుంచి రెగ్యులర్‌గా సాగనుందని సమాచారం. భారీ సెట్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌, మైథలాజికల్ టచ్‌తో కూడిన ఈ సినిమాను వినాయక చవితి లేదా దసరా సీజన్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతే కాదు ఎం.ఎం.కీరవాణి అందిస్తున్న సంగీతం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, రీసెంట్ గా ‘హరి హర వీరమల్లు’ వంటి సినిమాల్లో తన వర్క్‌కి ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి.. ఇప్పుడు ‘విశ్వంభర’కి సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Exit mobile version