NTV Telugu Site icon

Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు

Asaram1

Asaram1

అనేక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా ఆశారాం బాపు కేసుపై కీలక తీర్పు వెలువరించింది గుజరాత్ గాంధీనగర్ సెషన్స్ కోర్టు. మోటేరా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది సూరత్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు. పదేళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లయింట్‌పై తాజాగా కోర్టు తీర్చునిచ్చింది. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో నిందితులైన ఆశారాం కుమారుడు నారాయణ్‌ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జైలులో ఉన్నారు. ఆశారాం బాపు గతంలో అధ్యాత్మిక గురువుగా ఎందరో శిష్యులను సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లో కేంద్రాలను స్థాపించారు. చివరకు ఇలా కటకటాలపాలయ్యారు.

Liver Cirrhosis: మీ లివర్‌ని వీటితో ఆరోగ్యంగా ఉంచుకోండి..

ఆశారాంను కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆయనకు గరిష్ఠంగా జీవిత ఖైదు.. లేనిపక్షంలో కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంది. అయితే జోధ్‌పూర్‌లో ఇలాంటి మరో కేసులో ఆయన ఇప్పటికే దోషిగా తేలారని, అందుకే నేరాలు చేయడం అలవాటైన వ్యక్తి అని వాదనలు ముగిసిన తర్వాత లాయర్ కోడెకర్ కోర్టు వెలుపల మీడియాతో అన్నారు. ఆశారాంను సాధారణ నేరస్థుడిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శిష్యురాలిగా ఉన్న యువతిని మొతెరాలోని తన ఆశ్రమంలో బంధించి ఆమెపై అత్యాచారం చేసినందుకుగానూ కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరినట్లు చెప్పారు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆశారాం బాపూనకు భారీ జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్ అన్నారు. జైలులో ఉన్న దేవుడికి పదేళ్ల జైలు శిక్ష విధించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డిఫెన్స్ లాయర్ అన్నారు.