Site icon NTV Telugu

Asaduddin Owaisi: హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావడమే నా కల.. రాజ్యాంగంపై కీలక వ్యాఖ్యలు..!

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: జనవరి 15న ముంబై సహా మహారాష్ట్రలోని పలు నగరాల్లో పౌర ఎన్నికలు జరగనున్నాయి. మరుసటి రోజు (జనవరి 16)న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాలు రాజ్యాంగ హక్కులు, సుపరిపాలన అంశాల చుట్టూ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని AIMIM గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రచారం చేస్తున్న పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.

HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్‌లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!

భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి దేశ అత్యున్నత పదవులను అధిష్టించే హక్కును కల్పించింది అంటూ ఒవైసీ కొనియాడారు. అయితే పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం ఒక నిర్దిష్ట మతానికి చెందిన వ్యక్తి మాత్రమే ప్రధాని కావడానికి అవకాశం ఉందని.. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మేయర్ కావచ్చని ఆయన పేర్కొన్నారు.

TCS ఉద్యుగులకు షాక్.. వారందరికీ అప్రైజల్స్ స్టాప్ అంటూ..!

ఇందులో భాగంగానే.. “ఒకరోజు హిజాబ్ ధరించిన మన కుమార్తె ఈ దేశానికి ప్రధానమంత్రి కావడమే నా కల” అని ఒవైసీ ఆకాంక్షించారు. అలాగే ముస్లింలపై జరుగుతున్న విద్వేష రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ఈ ద్వేషం ఎక్కువ కాలం సాగదు.. ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారు అంతమైపోతారు. ప్రజల మనసుల్లో ఎంత విషం నింపారో రేపు కరుణాభావం పెరిగినప్పుడు వారికే అర్థమవుతుందని ఒవైసీ వ్యాఖ్యానించారు.

Exit mobile version