Site icon NTV Telugu

Arundhati Reddy: సీనియర్ ప్లేయర్స్‌ని పేరు పెట్టి పిలుస్తారా..? అసలు నిజం బయటపెట్టిన అరుంధతి రెడ్డి..!

Arundhati Reddy

Arundhati Reddy

Arundhati Reddy: రెండు పర్యాయాలు ఫైనల్‌కు చేరినా విజేతగా మాత్రం నిలవలేక పోయింది భారత మహిళా జట్టు. ఈసారి ఆ పరాభవాలకు చెక్‌ పెడుతూ 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. ఈ సారి భారత జట్టులో అందరూ ధిట్టలే.. ఎక్కడా తడపడకుండా విజయ దుందుబి మోగించారు. ఈ సందర్భంగా మన తెలుగు తేజం, తెలంగాణకు చెందిన మహిళా క్రీడాకారిణి అరుంధతి రెడ్డి ఎన్టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. భారత టీం ఐక్యత, సీనియర్స్- జూనియర్స్ ప్లేయర్స్‌ మధ్య సఖ్యత అంశంపై అరుంధతి రెడ్డి స్పందించింది.

READ MORE: Tragedy : దొంగ-పోలీస్‌ ఆట పేరుతో అత్తను చంపిన కోడలు

“ఇండియన్ టీంలో పేరు పెట్టి పిలిచేంత సఖ్యత ఉండదనే పుకార్లు ఉన్నాయి.. ఇందంతా నిజమేనా..? కేవలం బయట వాళ్లు మాట్లాడుకునే తప్పుడు వాదనలేనా..?” అని యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అరుంధతి సమాధానమిస్తూ.. అలా ఏముండదని కొట్టిపారేసింది. “అందరూ సరదగా, ఫ్రీగానే ఉంటారు. సీనియర్, జూనియర్ అనే వ్యత్యాసం ఏమి ఉండదు. హర్మన్ ప్రీత్ కౌర్ వయసులో పెద్దది. కానీ చిన్న పిల్లలాగే ప్రవర్తిస్తుంది. ఆమె ఎంతో జాలీగా ఉంటుంది. బయటవాళ్లే కల్పించుకుని ఇలా మాట్లాడుతారు. వాస్తవానికి టీమ్‌లో ఇలా ఏమి ఉండదు..” అని స్పష్టం చేసింది.

READ MORE: Hyderabad: బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్

 

Exit mobile version